ads
Sree VijayaLakshmi Textiles
Leela Narayana Pest Control
For Suggestions
1
galigopuram

మిత్రులారా !

ఏలూరులో పలు ప్ర‌ధాన పత్రిక‌లు, టీవీ చాన‌ళ్లు, సిటీ కేబుల్ త‌దిత‌ర మాధ్య‌మాల ద్వారా నిత్యం ప్ర‌జ‌ల‌కు స‌మాచారం అందుతుండ‌టం తెలిసిందే. అయితే ఇంట‌ర్నెట్ వినియోగ‌దారుల సంఖ్య ఏడాది ఏడాదికి రెట్టింపు అవుతుండ‌టంతో న్యూస్ వెబ్‌సైట్ ద్వారా కూడా స‌మాచారం అందించాల‌నే త‌లంపుతో ఏలూరు న‌గ‌రంలోనే తొలిసారిగా ఆన్‌లైన్ న్యూస్ వెబ్‌సైట్... వెబ్ ఏలూరు.కామ్ ప్రారంభించామని తెలియ‌జేయ‌డానికి ఎంతో సంతోషిస్తున్నాము. టీవీ చాన‌ళ్లు, ప‌త్రిక‌లు కొంత‌వ‌ర‌కే స‌మ‌యం, పేజీల‌ను కేటాయిస్తుండ‌గా కేవ‌లం ఏలూరు న‌గ‌ర వార్త‌ల‌కే పూర్తి స్థాయిలో ప్రాధాన్యం ఇచ్చే మా వెబ్‌సైట్ ద్వారా చిన్న‌ చిన్న వార్త‌ల‌ను సైతం, వీలైన‌న్ని ఎక్కువ ఫొటోల‌ను అందించాల‌ని నిర్ణ‌యించాం. అంతేకాక వార్త‌లకే ప‌రిమితం కాకుండా విస్తృత స్థాయిలో స‌మాచారం అందించేందుకు మా వెబ్ ఏలూరు టీమ్ కృషి చేస్తోంది. ఏలూరు న‌గ‌రంలో ఉన్న ప్ర‌తి వ‌ర్త‌క‌, వాణిజ్య‌, వ్యాపార‌, ఉద్యోగ‌, కార్మిక‌, రాజ‌కీయ‌, కుల‌, వ‌ర్గాల‌ పూర్తి స‌మాచారాన్ని మా వెబ్‌సైట్ ద్వారా ఇస్తున్నాం. స‌మాచార ఉద్య‌మంలా చేప‌ట్టిన ఈ బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మానికి మీ పూర్తి స‌హ‌కారం అందిస్తార‌ని ఆశిస్తూ..

అభినంద‌న‌ల‌తో..

మీ      
వెబ్ ఏలూరు టీమ్‌