ads
Leela Narayana Pest Control
Sree VijayaLakshmi Textiles
For Suggestions

- యూనియ‌న్‌కు ఏలూరులో భ‌వ‌న నిర్మాణానికి అవ‌స‌ర‌మైన స్థ‌లాన్ని కేటాయిస్తాం
- రాష్ట్ర గ‌నులు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీత‌ల సుజాత
- జెడ్పీలో తెలుగునాడు టీచ‌ర్స్ యూనియ‌న్ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం
వెబ్ఏలూరు.కామ్ డెస్క్ : రాష్ట్రాన్ని విద్యాహ‌బ్‌గా మార్చాల‌నే ల‌క్ష్యంతో రాష్ట్రంలో విద్య‌కు రూ.20వేల కోట్ల‌ను ప్ర‌భుత్వం కేటాయించింద‌ని, వ‌చ్చే బ‌డ్జెట్‌లో విద్యారంగానికి ప్ర‌భుత్వం అద‌న‌పు నిధులు కేటాయించి విజ్ఞాన కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్ద‌నున్న‌ట్టు రాష్ట్ర గ‌నులు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీత‌ల సుజాత చెప్పారు. స్థానిక జెడ్పీ స‌మావేశ మందిరంలో ఆదివారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ తెలుగునాడు టీచ‌ర్స్ యూనియ‌న్ స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రాంత యువ‌త కూడా విదేశీ విద్య‌ను ఆర్జించ‌డానికి ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున రుణ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తోంద‌ని, విద్య ఏ ఒక్క‌రి సొత్తు కాద‌ని, క‌ష్ట‌ప‌డి చ‌దివితే ఉన్న‌త శిఖ‌రాలు అధిరోహించ‌డం ఎవ‌రికైనా సాధ్య‌మేన‌న్న భావ‌న క‌ల్పిస్తున్న‌ట్టు పీత‌ల సుజాత చెప్పారు. ఉపాధ్యాయుల‌కు ప్ర‌భుత్వం అనేక రాయితీల‌ను క‌ల్పిస్తోంద‌ని, ప‌నితీరు ద్వారా అంద‌రి అభిమానాన్ని చూర‌గొనాల‌ని, ముఖ్యంగా ప్ర‌భుత్వ‌ప‌రంగా విద్యారంగంలో జ‌రిగే ప‌నుల‌న్నీ తెలుగునాడు టీచ‌ర్ల యూనియ‌న్ ద్వారానే చేస్తామ‌ని, వారి సిఫార్సుల‌కు అనుగుణంగా నిర్ణ‌యాలు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. యూనియ‌న్‌కు ఏలూరులో భ‌వ‌న నిర్మాణానికి అవ‌స‌ర‌మైన స్థ‌లాన్ని కేటాయిస్తామ‌న్నారు. జెడ్పీ చైర్మ‌న్ ముళ్ల‌పూడి బాపిరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు సార‌ధ్యంలో రాష్ట్రం అభివృద్ధి ప‌థంలో ప‌య‌నిస్తోంద‌న్నారు. కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్ జ‌వ‌హ‌ర్ మాట్లాడుతూ తాను 15 ఏళ్లు ఉపాధ్యాయ‌వృత్తిలో చంద్ర‌బాబు ద‌య‌తో ఎమ్మెల్యే కాగ‌లిగాన‌ని, కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గంలో రూ.77 ల‌క్ష‌ల‌తో పాఠ‌శాల‌ల్లో మౌలిక వ‌స‌తులు క‌ల్పించామ‌న్నారు. రాష్ట్ర తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్య‌క్షులు సుభాష్‌చంద్ర‌బోస్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఆత్మ‌స్థైర్యాన్ని పెంచ‌డ‌మే కాకుండా గౌర‌వంగా జీవించే విధంగా టీచ‌ర్ల బ‌దిలీ విధానంలో కౌన్సెలింగ్ ప‌ద్ధ‌తిని చంద్ర‌బాబు ప్ర‌వేశ‌పెట్టార‌న్నారు. అసోసియేష‌న్ వార్షిక కేలండ‌ర్‌, డైరీ, వాల్ స్టిక్క‌ర్ల‌ను మంత్రి సుజాత‌, ముళ్ల‌పూడి బాపిరాజు, కేఎస్ జ‌వ‌హ‌ర్ విడుద‌ల చేశారు. తొలుత విజ‌య‌న‌గ‌రం జిల్లా కొమ‌రాడ మండ‌లం పూనెరు రైల్వేస్టేష‌న్‌లో జ‌రిగిన హీరాకండ్ ఎక్స్‌ప్రెస్ ఘోర రైలు ప్ర‌మాదంలో 40 మంది మృతికి సంతాపంగా స‌భ‌లో రెండు నిమిషాలు మౌనం పాటించారు. వారి కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్ర హ‌స్త‌క‌ళ‌ల అభివృద్ధి సంస్థ చైర్మ‌న్ పాలిప్ర‌సాద్‌, ఎమ్మెల్సీ రామ‌కృష్ణ‌, ఉపాధ్యాయ అసోసియేష‌న్‌ల నాయ‌కులు రూజ్‌వెల్ట్‌, తాడేప‌ల్లిగూడెం మునిసిప‌ల్ చైర్మ‌న్ బోలిశెట్టి శ్రీ‌నివాస్‌, ఉపాధ్యాయ అసోసియేష‌న్ నాయ‌కులు కొల్లి నాగేశ్వ‌ర‌రావు పాల్గొన్నారు.