ads
Sree VijayaLakshmi Textiles
Leela Narayana Pest Control
For Suggestions
1
January 22, 2017 10:08 PM 225


- వేస‌విలో దుమ్ము రేగ‌కుండా చ‌ర్య‌లు, వీధిలైట్ల ఏర్పాటుకు కృషి
- కార్పొరేష‌న్ కోఆప్ష‌న్ స‌భ్యులు ఎస్ఎంఆర్ పెద‌బాబు
- ఏఎస్ఆర్ స్టేడియం మార్నింగ్ వాక‌ర్స్ అసోసియేష‌న్ నూత‌న కార్య‌వ‌ర్గ ప్ర‌మాణ స్వీకారం
వెబ్ఏలూరు.కామ్ డెస్క్ : న‌గ‌రంలో రోజురోజుకూ వాకర్స్ సంఖ్య పెరుగుతోంద‌ని, వాక‌ర్స్ కోసం సౌక‌ర్యాలు క‌ల్పిస్తామ‌ని కార్పొరేష‌న్ కోఆప్ష‌న్ స‌భ్యులు ఎస్ఎంఆర్ పెద‌బాబు చెప్పారు. స్థానిక అల్లూరి సీతారామ‌రాజు స్టేడియంలో మార్నింగ్ వాక‌ర్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ నూత‌న కార్య‌వ‌ర్గ ప్ర‌మాణ స్వీకారోత్స‌వ స‌భ‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. న‌గ‌రంలో ఉద‌యం వాకింగ్ చేసే వారు 10వేల మందికిపైగా ఉన్నార‌ని, ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ కోసం వాక‌ర్స్ రోజురోజుకు పెరుగుతున్నార‌ని, వారి కోసం అవ‌స‌ర‌మైన సౌక‌ర్యాల‌ను క‌ల్పిస్తామ‌ని చెప్పారు. ఏఎస్ఆర్ స్టేడియంలో తెల్ల‌వారుఝామునే వ‌స్తున్న వాక‌ర్స్‌కు వీధి లైట్లు లేక ఇబ్బంది ప‌డుతున్నార‌ని చెప్ప‌గా, సోమ‌వారం సాయంత్రంలోగా స్టేడియం చుట్టూ 8 వీధిలైట్లు ఏర్పాటు చేసేలా కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. అంతేకాకుండా అల్లూరి స్టేడియం, ఇండోర్ స్టేడియంల‌లో వేస‌వికాలంలో దుమ్ము ధూళి ఎక్కువ‌గా సంభ‌విస్తుంద‌ని, ఆ రోజుల్లో ప్ర‌తివారం రెండు స్టేడియాల‌లో దుమ్మ రేగ‌కుండా పూర్తి స్థాయిలో వాట‌రింగ్ చేయిస్తామ‌న్నారు. వాక‌ర్స్ న‌డిచే ప్రాంతాల్లో మొక్క‌ల పెంప‌కానికి కూడా చ‌ర్య‌లు తీసుకుంటామన్నారు. ఈ సంద‌ర్భంగా ఏఎస్ఆర్ స్టేడియం మార్నింగ్ వాక‌ర్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ అధ్య‌క్షులుగా ఎన్నికైన ఎస్ఎం అక్బ‌ర్‌ను పెద‌బాబు దుశ్శాలువాతో ఘ‌నంగా స‌త్క‌రించి అభినందించారు. నూత‌న కార్య‌వ‌ర్గం ఏడాదిలో మంచి సేవా కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టి అంద‌రి అభిమానాన్ని పొందాల‌ని కోరారు. నూత‌న కార్య‌వ‌ర్గంతో వాక‌ర్స్ అసోసియేష‌న్ జోన‌ల్ నాయ‌కులు ముర‌ళీమోహ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేయించారు. ఈ కార్య‌క్ర‌మంలో డాక్ట‌ర్ ప‌రాత్ప‌ర‌రావు, స్వీట్ మ్యాజిక్ అధినేత మోహ‌న‌రావు, కార్పొరేష‌న్ డెప్యూటీ మేయ‌ర్ గుడివాడ రామ‌చంద్ర‌కిశోర్‌, కార్పొరేట‌ర్లు మారం హ‌నుమంత‌రావు, బౌరోతు బాలాజీ, కోమ‌ర్తి వేణుగోపాల్‌, వాక‌ర్స్ నాయ‌కులు అప్పారావు, కార్య‌ద‌ర్శి నాగ‌విఘ్నేశ్వ‌ర‌రావు, కోశాధికారి ముర‌ళీకృష్ణ‌, గౌర‌వాధ్య‌క్షులు జ‌గ‌దేశ‌న్‌, లాల్ సాహెబ్‌, రాంబాబు, అచ్యుత‌రావు, మంచెం మైబాబు పాల్గొన్నారు.