ads
తాజా :
Leela Narayana Pest Control
Sree VijayaLakshmi Textiles
For Suggestions

వెబ్ఏలూరు.కామ్ డెస్క్ :  డిగ్రీ చ‌దువుకుంటూ సెల‌వు రోజుల్లో త‌ల్లిదండ్రుల‌కు చేదోడువాదోడుగా ఉంటున్న ఓ విద్యార్థి ఆదివారం గేదెల కోసం చెరువులోకి దిగగా మృత్యు ఒడికి చేరుకున్నాడు. పేద‌రికంతో బాధ‌ప‌డుతున్నా ఉన్న‌ ఒక్క‌గానొక్క కొడుకును ఉన్న‌త చ‌దువులు చ‌దివించాల‌నే ఆ త‌ల్లిదండ్రుల ఆశను అడియాశ చేస్తూ మృత్యువు క‌బ‌ళించ‌డాన్ని వారు జీర్ణించుకోలేక‌పోతున్నారు. పెద‌వేగి మండ‌లం రాయ‌న్న‌పాలెంలో తీవ్ర విషాద ఛాయ‌ల‌ను నింపిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పెద‌వేగి ఎస్ఐ వి.రామ‌కోటేశ్వ‌ర‌రావు తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి. రాయ‌న్న‌పాలెం గ్రామంలో జంగుమిల్లి శ్రీ‌నివాస‌రావు, ధ‌నల‌క్ష్మి దంప‌తుల కుమారుడు రాజేష్ (21) ఏలూరు సీఆర్ రెడ్డి క‌ళాశాల‌లో బి.కామ్ మూడో ఏడాది చ‌దువుతున్నాడు. గ‌తంలో ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా రాజేష్ కొంత‌కాలం చ‌దువుకు దూరమ‌య్యాడు. ఆ స‌మ‌యంలో త‌ల్లిదండ్రుల‌తోపాటు కూలి ప‌నుల‌కు వెళ్లేవాడు. ఉన్న‌త చ‌దువులు చ‌ద‌వాల‌ని త‌ల్లిదండ్రులు ప‌ట్టుద‌లతో రాజేష్‌ను మ‌ళ్లీ కళాశాల‌లో చేర్పించి చ‌దివిస్తున్నారు. దీంతో క‌ళాశాల‌కు వెళుతూనే సెల‌వు రోజుల్లో త‌ల్లిదండ్రుల‌కు స‌హ‌కారంగా ఉంటున్నాడు. ఈ నేప‌థ్యంలో ఆదివారం సెల‌వు కావ‌డంతో ఇంటి వ‌ద్దే ఉన్నాడు. గ్రామం స‌మీపంలోని బొమ్మ‌రాజుకుంట చెరువులో నీళ్లకు వెళ్లిన గేదెలు బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో వాటి కోసం చెరువులోకి దిగాడు. చెరువు లోతుగా ఉండ‌టంతో ఊపిరాడ‌క రాజేష్ మునిగి మృతి చెందాడు. స‌మాచారం అందుకున్న పెద‌వేగి ఎస్ఐ రామ‌కోటేశ్వ‌ర‌రావు చెరువు నుంచి మృత‌దేహాన్ని బ‌య‌ట‌కు తీయించి పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. కుమారుడు మృతితో త‌ల్లిదండ్రులు గుండెల‌విసేలా రోదించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు కొఠారు రామచంద్ర‌రావు, టీడీపీ నాయ‌కులు ప‌ర్వ‌త‌నేని ప్ర‌భాక‌ర్‌, ఎంపీటీసీ స‌భ్యురాలు చేబ‌త్తిన ఉషాశ్రీ‌నివాస‌రావు త‌ల్లిదండ్రుల‌ను ప‌రామ‌ర్శించారు.