ads
తాజా :
Leela Narayana Pest Control
Sree VijayaLakshmi Textiles
For Suggestions

- వివేకానంద ప్రజాపరిరక్షణ అధ్యక్షులు కోలా భాస్కరరావు
- ఆచంట ట్రస్ట్ కార్యాలయంలో సుభాష్‌చంద్ర‌బోస్‌ జయంతి వేడుక‌లు
వెబ్ఏలూరు.కామ్ డెస్క్ : దేశ స్వాతంత్ర్య ఉద్య‌మంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చూపిన‌ పోరాట పటిమను యువత ఆదర్శం గా తీసుకోవాలని వివేకానంద ప్రజాపరిరక్షణ అధ్యక్షులు కోలా భాస్కరరావు అన్నారు. సోమవారం రామ‌చంద్ర‌రావుపేట‌లోని ఆచంట ట్రస్ట్ కార్యాలయంలో సుభాష్ చంద్రబోస్ 120వ‌ జయంతి వేడుక‌ల‌ను శ్రీస్వామి వివేకానంద ప్రజాపరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కోలా భాస్కరరావు మాట్లాడుతూ సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్య్రం సాధ్యమని భావించి ఆజాద్ హిందూ ఫౌజ్ సంస్థ‌ను స్థాపించి పోరాటం సాగించిన ధీరుడని అన్నారు. ముఖ్య సలహాదారు ఆచంట వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ సాయుధ పోరాటం భారత స్వాతంత్య్ర పోరాటంలో చాలముఖ్య ఘట్టం అని, నేతాజీ జాతికి చేసిన సేవ‌ల‌ను భారత ప్రజలు ఎన్నటికీ మరవలేర‌న్నారు. ఉపాధ్యక్షుడు నండూరు శ్రీనివాస‌రావు, ప్రధాన కార్యదర్శి పోంతంగి సోమశేఖర్, కార్యదర్శి యల్లపు మురళి, వీవీఎస్ రామారావు, గంటా జోగిరాజు, చింతం నాగేశ్వరరావు పాల్గొన్నారు.