ads
Sree VijayaLakshmi Textiles
Leela Narayana Pest Control
For Suggestions
1
January 23, 2017 5:18 PM 256


- ఏబీవీపీ ఆధ్వ‌ర్యంలో విద్యార్థుల‌తో ర్యాలీ
- ప‌వ‌రుపేట గేటు వ‌ద్ద బోస్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి నాయ‌కుల నివాళి
వెబ్ఏలూరు.కామ్ డెస్క్ : అఖిల భార‌తీయ విద్యార్థి ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో నేతాజీ సుభాష్‌చంద్ర‌బోస్ 120వ జ‌యంతి సంద‌ర్భంగా స్థానిక గాంధీన‌గ‌ర్ న‌గ‌ర పాల‌క ఉన్న‌త పాఠ‌శాల నుంచి ప‌వ‌రుపేట గేటు వ‌ద్ద నేతాజీ విగ్ర‌హం వ‌ర‌కు ర్యాలీ నిర్వ‌హించారు. నేతాజీ విగ్ర‌హానికి ఏబీవీపీ నాయ‌కులు పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం కేక్ క‌ట్ చేసి పిల్ల‌ల‌కు పంచారు. ఈ సంద‌ర్భంగా న‌గ‌ర సంఘ‌ట‌నా కార్య‌ద‌ర్శి ఎ.శ్రీ‌కాంత్ మాట్లాడుతూ బ్రిటీష్ వ్య‌తిరేకంగా దేశాల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టి ప్ర‌త్యేక‌మైన సైన్యాన్ని ఏర్ప‌రిచి బ్రిటీష్‌వారిని త‌రిమిగొట్ట‌డానికి ఆజాద్ హింద్ ఫౌజ్‌ను త‌యారుచేసి జైహింద్ అనే నినాదం ఇచ్చిన మొట్ట‌మొద‌టి వ్య‌క్తి నేతాజీ అన్నారు. మీరు నాకు ర‌క్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను అని ఛ‌లో ఢిల్లీకి పిలుపునిచ్చిన పోరాట‌యోధుడు నేతాజీ అని కొనియాడారు. విద్యార్థులు, యువ‌త ఆయ‌న ఆశ‌యాల సాధ‌న‌కు కృషి చేయాల‌ని కోరారు. నాయ‌కులు రాంబాబు, గోపినాథ్‌, షేక్ సుభాని, భ‌వానిశంక‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.