ads
తాజా :
Leela Narayana Pest Control
Sree VijayaLakshmi Textiles
For Suggestions
January 23, 2017 5:20 PM 128


- డ్రెయిన్ల‌లోనే తాగునీటి పైప్‌లైన్‌
- క‌లుషిత నీరు తాగి అనారోగ్యాల‌బారిన ప్ర‌జ‌లు
- పోణంగి రోడ్డు వైఎస్సార్ కాల‌నీలో ప్ర‌జ‌ల‌ దుస్థితి
- ప‌ట్టించుకోని అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు
వెబ్ఏలూరు.కామ్ డెస్క్ : వెంక‌టాపురం పంచాయ‌తీ పోణంగి రోడ్డులోని వైఎస్సార్ కాల‌నీలో తాగునీటి కొర‌త‌తో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ కాల‌నీకి తాగునీటి పైప్‌లైన్ ఉన్న తాగేందుకు గుక్కెడు నీరు లేక అల్లాడుతున్నారు. ఈ ప్రాంతంలో తాగునీటి పైప్‌లైన్‌కు కుళాయి క‌నెక్ష‌న్లు ఇచ్చారు. అయితే ఆ కుళాయిలు నాసిర‌కం కావ‌డంతో తుప్పుప‌ట్టి శిథిల‌మైపోగా, వాటి స్థానంలో పైప్‌లైన్‌కు కుళాయి క‌నెక్ష‌న్ కోసం చేసిన హోల్స్ ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. కొన్ని చోట్ల పైప్‌లైన్‌ డ్రెయిన్ల‌లో ఉండ‌టంతో మురికినీరు పైపుల్లోకి చేరి తాగునీరు క‌లుషిత‌మ‌వుతోంది. ఆ నీటినే స్థానికులు ప్లాస్టిక్ పైపుల ద్వారా ప‌ట్టుకుంటూ వాడుక అవ‌స‌రాల‌కు వినియోగించుకుంటున్నారు. అయితే తాగునీరు ల‌భ్యం కాక వాటిని దూర‌ప్రాంతాల నుంచి కొని తెచ్చుకోవాల్సిన దుస్థితి నెల‌కొంది. దీంతో తాము వ్య‌య‌ప్ర‌యాస‌ల‌కు గుర‌వుతున్నామ‌ని చెబుతున్నారు. తాగునీటిని కొనుక్కుని తాగ‌లేని కొంద‌రు నిరుపేద‌లు ఈ నీటినే తాగుతూ అనారోగ్యాల‌బారిన ప‌డుతున్నారు. ఈ స‌మ‌స్య‌ను ప‌లుసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పంద‌న లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికైనా సంబంధిత‌ అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు స్పందించి కుళాయిలు ఏర్పాటు చేసి తాగునీటి సౌక‌ర్యం క‌ల్పించాల‌ని స్థానిక మ‌హిళ‌లు కోరుతున్నారు.