ads
Sree VijayaLakshmi Textiles
Leela Narayana Pest Control
For Suggestions
1

వెబ్ఏలూరు.కామ్ డెస్క్ : జిల్లాలో ఈ నెల 30న కుష్టు వ్యాధిపై అవ‌గాహ‌న స‌ద‌స్స‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్టు క‌లెక్ట‌ర్ కాటంనేని భాస్క‌ర్ చెప్పారు. క‌లెక్ట‌రేట్‌లో కుష్టువ్యాధి నిర్మూల‌న‌పై ప్ర‌చార పోస్ట్‌ను క‌లెక్ట‌ర్ విడుద‌ల చేశారు. అనంత‌రం మాట్లాడుతూ జిల్లాలో 73,350 మంది కుష్టువ్యాధిగ్ర‌స్తులు ఉన్నార‌ని గుర్తించామ‌ని, వ్యాధిని స‌మూలంగా నిర్మూలించడానికి బ‌హుళ ఔష‌ధ చికిత్స అందుబాటులోకి వ‌చ్చింద‌న్నారు. మ‌హాత్మాగాంధీ వర్ధంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 30న అన్ని గ్రామ‌పంచాయ‌తీల్లో స‌ర్పంచ్ అధ్య‌క్ష‌త‌న స‌మావేశాన్ని నిర్వ‌హించి కుష్టుర‌హిత స‌మాజ స్థాప‌న‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వ‌హించాల‌న్నారు. చ‌ర్మంపై స్ప‌ర్శ‌లేని మచ్చ‌లు ఉన్నా, చెవులు, ముఖంపై క‌ణిత‌లు ఉన్నా, కాళ్లు చేతుల‌పై స్ప‌ర్శ త‌గ్గినా, క‌నురెప్ప‌లు, క‌నుబొమ్మ‌లు వెంట్రుక‌లు రాలినా కుష్టువ్యాధి ల‌క్ష‌ణాలుగా భావించి స‌మీప ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలోకి వెళ్లి ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచించారు.