ads
Sree VijayaLakshmi Textiles
Leela Narayana Pest Control
For Suggestions
1

వెబ్ఏలూరు.కామ్ డెస్క్ : జిల్లాలో ఐదేళ్ల లోపు వ‌య‌స్సు ఉన్న 4 ల‌క్ష‌ల‌మంది చిన్నారులంద‌రికీ పోలియో చుక్క‌లు అందించాల‌నే ల‌క్ష్యంతో జ‌న‌వ‌రి 29 నుంచి 31వ తేదీ వ‌ర‌కు ప‌ల్స్‌పోలియో కార్య‌క్ర‌మాన్ని ప‌టిష్టంగా నిర్వ‌హించాల‌ని క‌లెక్ట‌ర్ కాటంనేని భాస్క‌ర్ వైద్యారోగ్య శాఖాధికారుల‌ను ఆదేశించారు. క‌లెక్టరేట్‌లో సోమ‌వారం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ 29న ఉద‌యం 7 గంట‌ల నుంచే జిల్లాలోని అన్ని గ్రామాల్లో, ప‌ట్ట‌ణాల్లో, బ‌స్టాండ్‌ల‌లో, రైల్వేస్టేష‌న్ల‌లో పోలియో చుక్క‌లు వేసే ప్ర‌త్యేక శిబిరాలు పెద్ద ఎత్తున‌ నిర్వ‌హించాల‌న్నారు. ప‌ల్స్‌పోలియో శిబిరాల‌కు రానివారికి చిన్నారుల‌ను గుర్తించి 30, 31 తేదీల్లో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి పోలియో చుక్క‌లు వేయాల‌ని ఆదేశించారు. ఇందుకోసం పెద్ద ఎత్తున ప్ర‌చారం చేయాల‌ని సూచించారు.