ads
Leela Narayana Pest Control
Sree VijayaLakshmi Textiles
For Suggestions

- మార్చి 1 నుంచి 18 వ‌ర‌కు ఇంట‌ర్ ప‌రీక్ష‌లు
- జిల్లాలో 104 కేంద్రాలలో ప‌రీక్ష‌లు రాయ‌నున్న 35వేల మంది విద్యార్థులు
ఈ ఏడాది సీసీ కెమెరాల న‌డుమ తొలిసారిగా టెన్త్ ప‌రీక్ష‌లు
- 250 ప‌రీక్ష కేంద్రాల‌లో ఇప్ప‌టినుంచే ప‌టిష్టమైన నిఘా
- క‌లెక్ట‌ర్ కాటంనేని భాస్క‌ర్
- ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై అధికారుల‌తో స‌మీక్ష‌
వెబ్ఏలూరు.కామ్ డెస్క్ : జిల్లాలో ఇంట‌ర్ ప‌రీక్ష‌లు మార్చి 1 నుంచి 18వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేసిన‌ట్టు క‌లెక్ట‌ర్ కాటంనేని భాస్క‌ర్ చెప్పారు. క‌లెక్ట‌రేట్‌లో సోమ‌వారం ఇంట‌ర్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై అధికారుల‌తో స‌మీక్షించారు. ప‌రీక్ష కేంద్రాల‌లో ఎక్క‌డా కాపీల‌కు తావులేకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప‌రీక్ష‌ల క‌న్వీన‌ర్ ఎస్ఎ ఖాద‌ర్‌ను ఆదేశించారు. జిల్లాలో 104 ప‌రీక్షా కేంద్రాల‌లో జ‌రిగే ఈ ప‌రీక్ష‌లుకు 35వేల మంది విద్యార్థులు హాజ‌రుకానున్నార‌న్నారు. అలాగే ఈ ఏడాది ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల్లో తొలిసారి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామ‌ని, జిల్లా వ్యాప్తంగా 250కి పైగా ప‌రీక్ష కేంద్రాల‌లో ప‌టిష్ట‌మైన నిఘా ఉంచాల‌నే ఉద్దేశంతో ప్ర‌తి ప‌రీక్ష హాలులో సీసీ కెమెరా ప‌నిచేస్తుంద‌న్నారు. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష ఫ‌లితాలలో జిల్లా 13వ స్థానంలో ఉన్నా త‌న‌కు అభ్యంత‌రం లేద‌ని, కానీ స్వ‌శ‌క్తిపై ప‌రీక్ష రాసే స‌త్తా విద్యార్థుల్లో ఉండాల‌న్న‌దే త‌న అభిమత‌మ‌ని, ఈ విష‌యంలో రాజీ లేద‌ని, మాస్ కాపీయింగ్ ప‌ద్ధ‌తుల‌కు స్వ‌స్తి ప‌ల‌కాల‌ని డీఈవో మ‌ధుసూద‌న‌రావును ఆదేశించారు. విద్యా ప్ర‌మాణాలు మెరుగుప‌డాలే త‌ప్ప మాస్ కాపీయింగ్ చేయించి విద్య‌లో ఏదో ఉద్ధ‌రిస్తున్నామ‌నే బిల్డ‌ప్ చ‌ర్య‌లు అవ‌స‌రం లేద‌న్నారు. జేసీ కోటేశ్వ‌ర‌రావు, ఏజెసీ ష‌రీఫ్‌, ఇంట‌ర్ విద్య రీజ‌న‌ల్ ఇన్‌స్పెక్ష‌న్ ఆఫీస‌ర్ ఖాద‌ర్‌, డీఈవో మ‌ధుసూద‌న‌రావు పాల్గొన్నారు.