ads
Sree VijayaLakshmi Textiles
Leela Narayana Pest Control
For Suggestions
1

- కెపిడిటి హైస్కూల్‌లో ర‌క్త‌దాన శిబిరం, ప్ర‌త్యేక ర్యాలీ, ర‌న్, ముగ్గుల పోటీలు
- ఏలూరు ఆర్డీవో నంబూరి తేజ్ భ‌ర‌త్
- 25న జాతీయ ఓట‌ర్ల దినోత్స‌వం సంద‌ర్భంగా కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌పై స‌మీక్ష‌
వెబ్ఏలూరు.కామ్ డెస్క్ : జాతీయ ఓట‌ర్ల దినోత్స‌వాన్ని ఈ నెల 25వ తేదీన నిర్వ‌హించేందుకు విస్తృత ఏర్పాట్లు చేసిన‌ట్టు ఏలూరు ఆర్డీవో నంబూరి తేజ్ భ‌ర‌త్ చెప్పారు. స్థానిక ఆర్డీవో కార్యాల‌యంలో సోమ‌వారం నిర్వ‌హించిన మీకోసం కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌ల నుంచి విన‌తులు స్వీక‌రించిన అనంత‌రం జాతీయ ఓట‌ర్ల దినోత్స‌వం నిర్వ‌హ‌ణ ఏర్పాట్ల‌పై ఆయ‌న స‌మీక్షించారు. ప్ర‌జ‌ల్లో ఓటు హ‌క్కుపై అవ‌గాహ‌న చైత‌న్యం క‌లిగించేందుకు ఏటా జ‌న‌వ‌రి 25న జాతీయ ఓట‌ర్ల దినోత్స‌వాన్ని కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ నిర్వ‌హిస్తుంద‌న్నారు. ఇందులో భాగంగా ఏలూరు కెపిడిటి హైస్కూల్‌లో ఈ నెల 25వ తేదీన ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు జిల్లా స్థాయి, ఏలూరు డివిజ‌న్ స్థాయి జాతీయ ఓట‌ర్ల దినోత్స‌వం నిర్వ‌హ‌ణ‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు. ఈ సంద‌ర్భంగా ర‌క్త‌దాన శిబిరం, ప్ర‌త్యేక ర్యాలీ, ర‌న్, ముగ్గుల పోటీలు నిర్వ‌హిస్తామ‌ని, విజేత‌ల‌కు బ‌హుమ‌తులు అందిస్తామ‌న్నారు. కొత్త‌గా ఓటరుగా న‌మోదైన వారికి ప్లాస్టిక్‌తో కూడిన ఎపిక్ కార్డుల‌ను అందిస్తామన్నారు. తాడేప‌ల్లిగూడెంకు చెందిన ఒక మ‌హిళ భ‌ర్త మ‌ర‌ణించ‌గా, ఆమెకు రూ.20వేలు ఆర్థిక స‌హాయాన్ని జాతీయ కుటుంబ సంక్షేమ ప‌థ‌కం కింద అందించారు.