ads
Sree VijayaLakshmi Textiles
Leela Narayana Pest Control
For Suggestions
1
January 23, 2017 6:02 PM 320


వెబ్ఏలూరు.కామ్ డెస్క్ : అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ప్ర‌క్రియ వేగ‌వంతం చేసి త‌మ‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ అగ్రిగోల్డ్ బాధితులు సోమ‌వారం స్థానిక క‌లెక్ట‌రేట్ వ‌ద్ద ఒక రోజు సామూహిక రిలే నిరాహార‌దీక్ష నిర్వ‌హించారు. అగ్రిగోల్డ్ కస్ట‌మ‌ర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ జిల్లా క‌మిటీ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన ఈ ఆందోళ‌న‌లో నాయ‌కులు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ కుంభ‌కోణానికి కార‌ణ‌మైన అవ్వా వెంక‌ట రామారావు కుటుంబ స‌భ్యుల‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.వెయ్యి కోట్ల ఫండ్ రిలీజ్ చేసి వేలం ద్వారా వ‌చ్చిన సొమ్మును రిక‌వ‌రీ చేసుకోవాల‌ని కోరారు. 20 నెల‌ల క్రిత‌మే అగ్రిగోల్డ్ ఆస్తుల‌ను అటాచ్ చేసిన ప్ర‌భుత్వం ఆస్తుల‌ను త‌క్ష‌ణం వేలం వేయాల‌ని, ప్ర‌తి నెలా వెయ్యి నుంచి రెండువేల కోట్ల రూపాయ‌ల విలువైన ఆస్తుల‌ను వేలం వేయాల‌ని డిమాండ్ చేశారు. అప్పుల కంటే ఆస్తులే ఎక్కువ ఉన్నాయ‌ని ప‌దే ప‌దే చెబుతున్న ప్ర‌భుత్వ‌మే వాటిని తీసుకుని ఖాతాదారుల‌కు వ‌డ్డీతో స‌హా డ‌బ్బులు చెల్లించాల‌న్నారు. సీఐడీ వ‌ద్ద ఉన్న అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తుల వివ‌రాల‌ను, వాటి విలువ‌, ఖాతాదారుల వివ‌రాల‌ను త‌క్ష‌ణం ఆన్‌లైన్‌లో పెట్టాల‌ని, అగ్రిగోల్డ్ రియ‌ల్ ఎస్టేట్‌లో ప్లాట్ల కొర‌కుడ‌బ్బులు క‌ట్టిన వారికి చెప్పిన విధంగా డెవ‌ల‌ప్‌మెంట్ చేసి వారికి రిజిస్ట్రేష‌న్ చేసి ఇవ్వాల‌ని కోరారు. ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నబాధిత‌ కుటుంబాల‌కు రూ.10 ల‌క్ష‌లు చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల‌న్నారు. అనంత‌రం క‌లెక్ట‌రేట్‌లో విన‌తిప‌త్రం అందజేశారు. రాష్ట్ర‌ నాయకులు తిరుపతిరావు, జిల్లా గౌరవ అధ్యక్షులు య‌ర్రా వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు వి.ఏసయ్య, నాయ‌కులు బోద్దపు శ్రీనివాసరావు, బి.రామకృష్ణ, తుమ్మ రాంబాబు, రామ్, శ్రీను, వై.నాగలక్ష్మి, పార్వతి, ఎస్‌కె బాజి, మేడికొండ వెంకటేశ్వరరావు, ఏలూరు, తాడేప‌ల్లిగూడెం, త‌ణుకు, పాల‌కొల్లు, భీమ‌వ‌రం, కైక‌లూరు శాఖ‌ల నాయ‌కులు పాల్గొన్నారు.