ads
Sree VijayaLakshmi Textiles
Leela Narayana Pest Control
For Suggestions
1

వెబ్ఏలూరు.కామ్ డెస్క్ : పెదవేగి మండ‌లం జానంపేట పంచాయ‌తీ ప్ర‌కాష్‌న‌గ‌ర్‌కు చెందిన పీట్ల రాజేశ్వ‌రి ఆదివారం నుంచి క‌నిపించ‌డం లేద‌ని ఆమె తండ్రి కొండ‌య్య పెద‌వేగి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పెద‌వేగి ఎస్ఐ వి.రామ‌కోటేశ్వ‌ర‌రావు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. కొండ‌య్య‌కు ముగ్గురు కుమార్తెలు కాగా ఆఖ‌రి కుమార్తె రాజేశ్వ‌రి ఏలూరులోని సెయింట్ థెరిస్సాక‌ళాశాల‌లో డిగ్రీ రెండో సంవ‌త్స‌రం చ‌దువుతోంది. ఆదివారం కొండ‌య్య పొలానికి వెళ్ల‌గా, ఇద్ద‌రు కుమార్తెలు చ‌ర్చికి వెళ్లారు. రాజేశ్వ‌రి ఇంటి వ‌ద్దే ఉంది. ఇంటికి వ‌చ్చిన‌ కుమార్తెలకు రాజేశ్వ‌రి క‌నిపించ‌లేదు. దీనిపై ఆరా తీయ‌గా, జానంపేట‌కు చెందిన చిట్టిబొమ్మ స‌తీష్ అనే వ్య‌క్తి ఆటోలో వెళ్లింద‌ని స్థానికుల ద్వారా తెలిసింది. సోమ‌వారం కూడా ఆమె రాక‌పోవ‌డంతో తండ్రి పెదవేగి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు ఎస్ఐ తెలిపారు.