ads
Sree VijayaLakshmi Textiles
Leela Narayana Pest Control
For Suggestions
1

- గ్రామాల్లో తిరిగే అవ‌కాశం కూడా ప్ర‌తిప‌క్షానికి ఉండ‌దు
- ప్ర‌భుత్వ విప్ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్
- ల‌క్ష్మీపురంలో ఏఎంసీ గోడౌన్ నిర్మాణానికి శంకుస్థాప‌న‌
వెబ్ఏలూరు.కామ్ డెస్క్ : రైతుల సంక్షేమ‌మే ప్ర‌భుత్వ ధ్యేయ‌మ‌ని దెందులూరు ఎమ్మెల్యే, ప్ర‌భుత్వ విప్ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ అన్నారు. పెద‌వేగి మండ‌లం ల‌క్ష్మీపురంలోని దెందులూరు వ్య‌వ‌సాయ మార్కెట్ యార్డులో రూ.1.85 కోట్ల‌తో నిర్మించ‌నున్న‌గోడౌన్ నిర్మాణానికి ప్ర‌భాక‌ర్ సోమ‌వారం శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రైతులు పండించిన పంట ఉత్ప‌త్తుల‌కు గిట్టుబాటు ధ‌ర‌ అందించాల‌నే ల‌క్ష్యంతో మార్కెట్ యార్డును ఏర్పాటు చేశామ‌న్నారు. యార్డు ఏర్పాటు కార‌ణంగా నిమ్మ రైతుల‌కు ఆశించిన మేర‌కు మ‌ద్ద‌తు ధ‌ర ల‌భించింద‌న్నారు. ప్ర‌జ‌ల చిర‌కాల స్వ‌ప్నం పోల‌వ‌రం ప్రాజెక్ట్ నిర్మాణంతో రాష్ట్ర స‌శ్య‌శ్యామ‌లం అవుతుంద‌ని, పోల‌వరం నిర్మాణానికి చంద్ర‌బాబు చేసిన ప్ర‌య‌త్నాలు ప్ర‌జ‌లంద‌రికీ తెలుసు అన్నారు. ప్ర‌జ‌ల ఆర్థికాభివృద్ధికి ప్ర‌భుత్వం చేస్తున్న కృషిని చూసి ఓర్వ‌లేని ప్ర‌తిప‌క్షం ప‌లు ఆరోప‌ణ‌లు చేస్తూ ప్ర‌జ‌ల‌ను తప్పుదోవ ప‌ట్టించ‌డానికి చూస్తోంద‌ని ఆగ్ర‌హంగా చెప్పారు. ఎవ‌రెన్ని చెప్పినా చెడు చేయాల‌ని చూసినా ప్ర‌జ‌లు తిప్పికొడ‌తార‌ని, గ్రామాల్లో తిరిగే అవ‌కాశం కూడా ప్ర‌తిప‌క్షానికి ఉండ‌ద‌ని ఎద్దేవా చేశారు. యార్డు భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకుని 100 మీట‌ర్ల పొడ‌వు, 48 మీట‌ర్ల వెడ‌ల్పుతో నిర్మించ‌నున్న ఈ భారీ గోడౌన్‌తో రైతుల‌కు మ‌రింత ల‌బ్ది చేకూరుతుంద‌న్నారు. రాజ్య‌స‌భ స‌భ్యుడు గ‌రికిపాటి రామ్మోహ‌న‌రావు, ఏఎంసీ చైర్మ‌న్ మాగంటి సురేంద్ర‌నాథ్ చౌద‌రి, వైస్ చైర్మ‌న్ గండివ‌ల‌స జ్ఞానేశ్వ‌ర‌రావు, పెద‌వేగి ఎంపీపీ దేవ‌ర‌ప‌ల్లి బ‌క్క‌య్య‌, ల‌క్ష్మీపురం, గోప‌న్న‌పాలెం సర్పంచ్‌లు మేకా రంగారావు, మాగంటి తార‌క‌దుర్గ నారాయ‌ణ ప్ర‌సాద్‌, రైతు నాయ‌కుడు ఆల‌పాటి అమ‌రేంద్ర‌నాథ్‌ద‌త్తు, డీఈ శ్రీ‌నివాస‌రావు, ఏఈ రాజ‌బాబు, ఏఎంసీ కార్య‌ద‌ర్శి మ‌హేంద్ర‌నాథ్ పాల్గొన్నారు.