ads
Sree VijayaLakshmi Textiles
Leela Narayana Pest Control
For Suggestions
1

- 25 నుంచి 30 వ‌ర‌కు కాపు రిజ‌ర్వేష‌న్ ఉద్య‌మ‌నేత‌ ముద్ర‌గ‌డ పాద‌యాత్ర
- రావులపాలెం నుంచి అంత‌ర్వేది వ‌ర‌కు సాగనున్న పాద‌యాత్ర‌
- జిల్లాలో సాధార‌ణ ప్ర‌జానీకానికి ఇబ్బంది క‌ల‌గ‌కూడ‌ద‌నే 144 సెక్ష‌న్‌
- అనుమ‌తి లేనిదే స‌మావేశాలు, స‌భ‌లు నిర్వ‌హించరాదు
- క‌లెక్ట‌ర్ కాటంనేని భాస్క‌ర్‌
వెబ్ఏలూరు.కామ్ డెస్క్ : మాజీ ఎంపి, కాపు రిజ‌ర్వేష‌న్ ఉద్య‌మ నేత‌ ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం పాద‌యాత్ర సంద‌ర్భంగా ఈ నెల 24వ తేదీ అర్ధ‌రాత్రి నుంచి 30వ తేదీ అర్ధ‌రాత్రి వ‌ర‌కు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో 144 సెక్ష‌న్ అమ‌లు చేస్తున్న‌ట్టు క‌లెక్ట‌ర్ కాటంనేని భాస్క‌ర్‌ సోమ‌వారం రాత్రి ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. తూర్పుగోదావ‌రి జిల్లా రావుల‌పాలెం నుంచి అంత‌ర్వేది వ‌ర‌కు ఈ నెల 25 నుంచి ముద్ర‌గ‌డ‌ పాద‌యాత్ర ఈ సంద‌ర్భంగా జిల్లాలో సాధార‌ణ ప్ర‌జాజీవ‌నానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా ఈ చ‌ర్య‌లు తీసుకున్నామ‌న్నారు. 144 సెక్ష‌న్ అమ‌లులో ఉన్న ప్రాంతాల్లో న‌లుగురు లేదా అంత‌కుమించి ఒకేచోట గుమికూడి ఉండ‌టం, స‌భ‌లు, స‌మావేశాల్లో ఉద్రేక‌పూరిత, ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టేలా ప్ర‌సంగాలు చేయ‌డం నిషేధ‌మ‌న్నారు. స‌భ‌లు, స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌కు ముంద‌స్తు అనుమతి త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల‌న్నారు. ఈ ఉత్త‌ర్వుల‌కు విరుద్దంగా వ్య‌వ‌హ‌రించేవారిపై క్రిమినల్ కేసులు న‌మోదు చేస్తామ‌ని హెచ్చ‌రించారు.