ads
Leela Narayana Pest Control
Sree VijayaLakshmi Textiles
For Suggestions
January 24, 2017 7:25 PM 167


- రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు హామీ
- జాప్ అధ్య‌క్షుడు కె.న‌ర‌సింహారావు కోరిక‌పై స్పందించిన మంత్రి దేవినేని
- విజ‌య‌వాడ‌లో విజ‌య‌వంతంగా ముగిసిన‌ జాప్ రాష్ట్ర మ‌హాస‌భ‌లు
- జిల్లా నుంచి అధిక సంఖ్య‌లో త‌ర‌లివెళ్లిన పాత్రికేయ ప్ర‌తినిధులు
వెబ్ఏలూరు.కామ్ డెస్క్ : పోల‌వ‌రం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో మీడియా పాయింట్ ఏర్పాటుకు త‌గిన ఏర్పాట్లు చేస్తామ‌ని రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి పోల‌వ‌రంలో ప్ర‌క‌ట‌న వెలువ‌రిస్తామ‌ని చెప్పారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన పోల‌వ‌రం ప్రాజెక్ట్ ప్రాంతంలో జ‌రుగుతున్న ప్ర‌గ‌తి ప‌నులు, త‌దిత‌రాల‌పై ముఖ్య‌మంత్రి, మంత్రులు, అధికారులు, వివ‌రాలు అందించే స‌మ‌యంలో విలేక‌రుల‌కు అనువైన ప్ర‌దేశం లేద‌ని, అందువ‌ల్ల అక్క‌డ మీడియా పాయింట్ ఏర్పాటు చేయాల‌ని కోరుతూ జాప్ అధ్య‌క్షుడు కె.న‌ర‌సింహారావు నీటిపారుద‌ల శాఖ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు దృష్టికి తీసుకురాగా, ఆయ‌న పై విధంగా స్పందించారు. స‌భ‌కు ముఖ్య అతిథిగా హాజ‌రైన శాస‌న‌స‌భ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు మాట్లాడుతూ వార్త‌లపై జ‌ర్న‌లిస్టుల ఆలోచ‌నా విధానం మారాల‌ని, వాస్త‌వాలకు అనుగుణంగా వార్తార‌చ‌న జ‌ర‌గాల‌న్నారు. జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌ల‌పై మూడు గుర్తింపు సంఘాలు జాయింట్ యాక్ష‌న్ క‌మిటీగా ఏర్ప‌డ‌టం అభినంద‌నీయ‌మ‌న్నారు. జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌ల‌పై అసెంబ్లీలో చ‌ర్చిస్తామ‌న్నారు. అంత‌కుముందు జాప్ 2017 డైరీని ఆవిష్క‌రించారు. 22న విజ‌య‌వాడ‌లో జ‌రిగిన జ‌ర్న‌లిస్టు అసోసియేష‌న్ ఆఫ్ ఆంధ్ర‌ప్ర‌ద‌శ్ (జాప్‌) రాష్ట్ర మ‌హాస‌భ‌లు విజ‌య‌వంతంగా జ‌రిగాయి. మ‌హాస‌భ‌ల‌కు జిల్లా నుంచి విశేషంగా జర్న‌లిస్టు ప్ర‌తినిధులు హాజ‌రయ్యారు.