ads
తాజా :
Leela Narayana Pest Control
Sree VijayaLakshmi Textiles
For Suggestions
January 24, 2017 7:41 PM 146


- జిల్లాలో ఇప్ప‌టికే 242 గ్రామాలను తీర్చిదిద్దాం
- త్వ‌ర‌లో మ‌రో 324 గ్రామాల‌ను సిద్ధం చేస్తున్నాం
- క‌లెక్ట‌ర్ కాటంనేని భాస్కర్
- జిల్లా క‌లెక్ట‌ర్ల‌ వీడియో కాన్ఫ‌రెన్స్‌
వెబ్ఏలూరు.కామ్ డెస్క్ : జిల్లాలో మార్చి నాటికి బ‌హిరంగ మ‌ల‌విస‌ర్జ‌న లేని జిల్లాగా తీర్చిదిద్దుతాన‌ని క‌లెక్ట‌ర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. క‌లెక్ట‌రేట్‌లో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్పీ ట‌క్క‌ర్ జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో క‌లెక్ట‌ర్ భాస్క‌ర్ పాల్గొన్నారు. జిల్లాలో 1.80 ల‌క్ష‌ల వ్య‌క్తిగ‌త మ‌రుగుదొడ్లు మంజూరు చేశామ‌ని, ఇందులో ఒక ల‌క్షా 14వేలు పూర్త‌య్యాయ‌ని, మ‌రో 70 వేలు నిర్మాణం పూర్తి కావ‌డానికి చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని క‌లెక్ట‌ర్ చెప్పారు. జిల్లాలో 28,178 వ్య‌క్తిగ‌త మ‌రుగుదొడ్లు మంజూరు చేసిన‌ప్ప‌టికీ నిర్మాణం చేప‌ట్ట‌లేద‌ని, త్వ‌ర‌లో ఆయా ల‌బ్దిదారులను చైత‌న్య‌రిచి మార్చి 31వ తేదీనాటిక‌ల్లా నూరుశాతం మ‌రుగుదొడ్లు నిర్మాణం పూర్తి చేసి బ‌హిరంగ మ‌ల‌విస‌ర్జ‌న లేని జిల్లాగా ప‌శ్చిమ‌ను ప్ర‌క‌టిస్తామ‌న్నారు. జిల్లాలో ఇప్ప‌టికే 242 గ్రామాల‌ను బ‌హిరంగ మ‌ల‌విస‌ర్జ‌న ర‌హిత గ్రామాలుగా తీర్చిదిద్దామ‌న్నారు. ఉపాధి హామీ ప‌థ‌కంలో 48వేల మ‌రుగుదొడ్ల నిర్మాణ ప‌నులు చురుగ్గా సాగుతున్నాయ‌న్నారు. త్వ‌ర‌లో మ‌రో 324 గ్రామాల‌ను బ‌హిరంగ మ‌ల‌విస‌ర్జ‌న ర‌హిత గ్రామాలుగా త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తామ‌న్నారు. జిల్లాలో ఎక్క‌డా తాగునీటి స‌మస్య లేకుండా చ‌ర్య‌లు తీసుకున్నామ‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ట‌క్క‌ర్ మాట్లాడుతూ నెల్లూరు, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాల్లో నూరుశాతం వ్య‌క్తిగ‌త మ‌రుగుదొడ్ల నిర్మాణ ప‌నులు చేప‌ట్టి త్వ‌ర‌లోనే బ‌హిరంగ మ‌ల విస‌ర్జ‌న లేని జిల్లాగా తీర్చిదిద్దే కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ల కృషి ప్ర‌శంసనీయ‌మ‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వ తాగునీరు, పారిశుధ్య మిష‌న్ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ ప‌ర‌మేశ్వ‌ర‌న్ మాట్లాడారు. వీడియో కాన్ఫ‌రెన్స్‌లో ఆర్‌డ‌బ్ల్యుఎస్ ఎస్ఈ అమ‌రేశ్వ‌ర‌రావు తదిత‌రులు పాల్గొన్నారు.