ads
Sree VijayaLakshmi Textiles
Leela Narayana Pest Control
For Suggestions
1
January 24, 2017 7:55 PM 220


- ఎమ్మెల్సీ రాము సూర్యారావు
- మ‌ల్టీప‌ర్ప‌స్ హెల్త్ వ‌ర్క‌ర్ల‌కు స‌దస్సు
- ప‌త్తేబాద రెడ్‌క్రాస్ బిల్డింగ్‌లో కార్య‌క్ర‌మం
వెబ్ఏలూరు.కామ్ డెస్క్ : న‌ర్సింగ్ వృత్తి ఎంతో ప‌విత్ర‌మైంద‌ని, స‌మాజంలో ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు రోగుల‌కు చిత్త‌శుద్ధితో సేవ‌లు అందించాల‌ని ఎమ్మెల్సీ రాము సూర్యారావు చెప్పారు. స్థానిక ప‌త్తేబాద రెడ్‌క్రాస్ బిల్డింగ్‌లో మంగ‌ళ‌వారం మ‌ల్టీప‌ర్ప‌స్ హెల్త్ వ‌ర్క‌ర్ల‌కు నిర్వ‌హించిన స‌ద‌స్సు సంద‌ర్భంగా 20వ బ్యాచ్ స్టూడెంట్స్ ట్రైనింగ్ కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ రోగుల‌కు సేవ చేయ‌డం అదృష్టంగా భావించాల‌న్నారు. ఉద్యోగంలో నర్సింగ్ సిబ్బంది చిత్త‌శుద్ధి, అంకిత‌భావంతో సేవ‌లు అందిస్తే దేవునికి సేవ చేసిన‌ట్టేన‌ని ఆయ‌న చెప్పారు. సిబ్బంది రోగుల‌తో స్నేహ‌పూర్వ‌కంగా మెల‌గాల‌ని, వారికి అమూల్య‌మైన సేవ‌లు అందించి మంచి గుర్తింపు పొందాల‌న్నారు. ఆసుప‌త్ర సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ ఏవీఆర్ మోహ‌న్‌, రెడ్‌క్రాస్ చైర్మ‌న్ మాగంటి ప్ర‌సాద్‌, అద‌న‌పు డీఎంహెచ్‌వో ప్రిన్సిప‌ల్ వై.డ‌బోరా, రెడ్‌క్రాస్ క‌మిటీ స‌భ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.