ads
Sree VijayaLakshmi Textiles
Leela Narayana Pest Control
For Suggestions
1

- ఇబ్ర‌హీంపట్నంలో ఫిబ్ర‌వ‌రి 9 నుంచి జాతీయ మ‌హిళా పార్ల‌మెంట్‌
- ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌దివేల మంది మహిళ‌లు పాల్గొంటున్నారు
- మ‌హిళ‌ల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ‌.. మంత్రి పీత‌ల సుజాత‌
- జాతీయ బాలికా దినోత్స‌వం సంద‌ర్భంగా ర్యాలీ ప్రారంభం
వెబ్ఏలూరు.కామ్ డెస్క్ : ఇబ్ర‌హీంప‌ట్నం ప‌విత్ర సంగ‌మం వ‌ద్ద ఫిబ్ర‌వ‌రి 9, 10, 11 తేదీల్లో జాతీయ మ‌హిళా పార్ల‌మెంట్ నిర్వ‌హించ‌నున్న‌ట్టు రాష్ట్ర గ‌నులు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీత‌ల సుజాత చెప్పారు. జాతీయ బాలికా దినోత్స‌వం సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం స్థానిక ఐఏడీపీ హాలు వ‌ద్ద జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అనంత‌రం ఆమె మాట్లాడుతూ జాతీయ మ‌హిళా పార్ల‌మెంట్‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌దివేల మంది మహిళ‌లు పాల్గొన‌నున్నార‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మ‌హిళ‌ల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చిస్తామ‌న్నారు. రాష్ట్రం నలుమూల‌ల నుంచి మ‌హిళా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇత‌ర మ‌హిళా ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొంటార‌ని, జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున మ‌హిళ‌లు పాల్గొనాల‌ని మంత్రి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే బ‌డేటి కోట రామారావు (బుజ్జి), ఎమ్మెల్సీ రాము సూర్యారావు, ఏఎంసీ చైర్మ‌న్ కురెళ్ల రామ్‌ప్ర‌సాద్‌, అద‌నపు జాయింట్ క‌లెక్ట‌ర్ ఎంహెచ్ ష‌రీఫ్‌, ఆర్డీవో నంబూరి తేజ్‌భ‌ర‌త్‌, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ ఆర్‌జెడి విద్యావ‌తి, డీఎంహెచ్‌వో డాక్ట‌ర్ కె.కోటేశ్వ‌రి పాల్గొన్నారు.