ads
Sree VijayaLakshmi Textiles
Leela Narayana Pest Control
For Suggestions
1

- ఇప్ప‌టివ‌ర‌కు 10 జిల్లాలు సారా ర‌హితం
- 4వేల మ‌ద్యం షాపుల‌కు 1000 షాపుల్లో స్వైపింగ్ మెషిన్లు ఏర్పాటు చేశాం
- త్వ‌ర‌లో మిగిలిన షాపుల్లోనూ ఏర్పాటుకు చ‌ర్య‌లు
- రాష్ట్ర ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ క‌మిష‌న‌ర్ ముఖేష్‌కుమార్ మీనా
- ఏలూరులో విలేక‌రులకు వెల్ల‌డి
వెబ్ఏలూరు.కామ్ డెస్క్ : రాష్ట్రంలో ఇంత‌వ‌ర‌కు 10 జిల్లాల‌ను సారా ర‌హిత జిల్లాలుగా ప్ర‌కటించామ‌ని రాష్ట్ర ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ క‌మిష‌న‌ర్ ముఖేష్‌కుమార్ మీనా చెప్పారు. క‌లెక్టరేట్‌లో మంగ‌ళ‌వారం ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ మ‌రో మూడు నెల‌ల్లో రాష్ట్రంలో మిగిలిన అన్ని జిల్లాలను కూడా సారార‌హితంగా తీర్చిదిద్దుతామ‌న్నారు. రాష్ట్రంలో ఎక్క‌డా నాటుసారా లేకుండా అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని, నాటుసారా వ‌ల్ల మ‌ర‌ణాలు గ‌ణ‌నీయంగా తగ్గాయ‌న్నారు. రాష్ట్రంలో గ‌తంలో 50వేల కేసులు న‌మోదు అయితే ఇపుడు ఆరు నుంచి ఏడువేల కేసులు వ‌ర‌కు మాత్ర‌మే న‌మోదవుతున్నాయ‌ని, ఇది నాటుసారా నిర్మూల‌న‌కు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌కు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. రాష్ట్రంలో సుమారు 4వేల మ‌ద్యం షాపులు ఉండ‌గా, 1000 దుకాణాల్లో స్వైపింగ్ మెషీన్లు ఏర్పాటు చేశామ‌ని, మిగిలిన షాపుల్లోన మెషిన్ల‌ను త్వ‌ర‌లో ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఎక్సైజ్ సిబ్బంది వారి విధుల‌తో పాటు సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డం త‌న‌కెంతో సంతోషానిచ్చింద‌ని, వారు చేస్తున్న సేవ‌ల‌కు త‌మ‌వంతు స‌హ‌కారం ఎప్పుడూ అందిస్తామ‌న్నారు. ఆయ‌న వెంట ఏలూరు డెప్యూటీ క‌మిష‌న‌ర్ ఆఫ్ ఎక్సైజ్ వై.భాస్క‌ర‌రావు, మాన‌వ‌తా స్వ‌చ్చంద సేవా సంస్థ జిల్లా అధ్య‌క్షులు ర‌వివ‌ర్మ పాల్గొన్నారు.