ads
Sree VijayaLakshmi Textiles
Leela Narayana Pest Control
For Suggestions
1
January 24, 2017 8:51 PM 245


- ఎల్ఐసీ ఏఒఐ ఏలూరు బ్రాంచి అధ్యక్షులు డీవీ రామకృష్ణ, ఉపాధ్యక్షులు జి.రవికిషోర్
- ఎల్ఐసీ బ్రాంచ్ కార్యాల‌యంలో జాతీయ ఓట‌ర్ల దినోత్స‌వం సంద‌ర్భంగా కార్య‌క్ర‌మం
వెబ్ఏలూరు.కామ్ డెస్క్ : ప‌ద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొంది, దేశ సార్వత్రిక ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకునేలా ఎల్ఐజీ ఏజెంట్లు చైత‌న్య‌ప‌ర‌చాల‌ని ఎల్ఐసీ ఏఒఐ ఏలూరు బ్రాంచి అధ్యక్షులు డీవీ రామకృష్ణ, ఉపాధ్యక్షులు జి.రవికిషోర్ కోరారు. ఎల్ఐసీ బ్రాంచ్ కార్యాల‌యంలో జాతీయ ఓట‌ర్ల దినోత్స‌వం సంద‌ర్భంగా ఓటు హ‌క్కు, విలువపై మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన స‌మావేశంలో వారు మాట్లాడారు. ఓట‌ర్ల దినోత్స‌వం సంద‌ర్భంగా కొత్త ఓట‌ర్ల‌ను ప్రోత్స‌హిస్తూ ప్ర‌భుత్వం చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌కు ఎల్ఐజీ ఏజెంట్లు స‌హ‌కారం అందించాల‌న్నారు. ఆర్గ‌నైజింగ్ కార్య‌ద‌ర్శి బి.రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఓటు హక్కు, విలువను ప్ర‌జ‌లకు అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు. అలాగే ఎల్ఐసీ పాల‌సీ వ‌ల్ల బీమాదారుల‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను తెలిపి చైత్య‌వంతుల‌ను చేయాల‌న్నారు. బోద్దపు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎల్ఐసీ ఏజెంట్లు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సామాజిక ప‌రిస్థితుల‌పై కూడా అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. బ్రాంచ్ కార్య‌ద‌ర్శి జేఎస్ఆర్ చంద్ర‌శేఖ‌ర్‌, ఎల్ఐసీ ఏఒఐ ఆఫీస్ బేరర్లు, ఈసీ మెంబ‌ర్లు పాల్గొన్నారు.