ads
Sree VijayaLakshmi Textiles
Leela Narayana Pest Control
For Suggestions
1

- రూ.5 కోట్ల వ్య‌యంతో జిల్లా ప‌రిశ్ర‌మ‌ల కేంద్రానికి త్వ‌ర‌లో నూత‌న భ‌వ‌నం
- కొత్త భవ‌నంలోకి రానున్న‌ కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి, ఏపీఐఐసీ, టౌన్ ప్లానింగ్ కార్యాయాలు
- ఆటోన‌గ‌ర్లో ఖాళీగా ఉన్న 192 ప్లాట్‌ల‌ను భ‌ర్తీ చేయండి
- క‌లెక్ట‌ర్ కాటంనేని భాస్క‌ర్
- జిల్లా ప‌రిశ్ర‌మ‌ల ప్రోత్సాహ‌క మండ‌లి స‌మావేశం
వెబ్ఏలూరు.కామ్ డెస్క్ : ఏలూరులో రూ.5 కోట్ల వ్యయంతో ప‌రిశ్ర‌మ‌ల కేంద్ర భ‌వ‌నాన్ని నిర్మించ‌డానికి ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేయాల‌ని క‌లెక్ట‌ర్ కాటంనేని భాస్క‌ర్ ప‌రిశ్ర‌మ‌ల శాఖ అధికారుల‌ను ఆదేశించారు. క‌లెక్ట‌రేట్‌లో బుధ‌వారం జిల్లా ప‌రిశ్ర‌మ‌ల ప్రోత్సాహ‌క మండ‌లి స‌మావేశంలో క‌లెక్ట‌ర్ ప‌రిశ్ర‌మ‌ల అనుమ‌తులు తీరుపై స‌మీక్షించారు. ప్ర‌స్తుతం జిల్లా ప‌రిశ్ర‌మ‌ల కేంద్ర భ‌వ‌నం చాలా శిథిలావ‌స్థ‌లో ఉంద‌ని, దాని స్థానే రూ.5 కోట్ల వ్య‌యంతో 4 అంత‌స్తుల భ‌వ‌నాన్ని నిర్మించి ప‌రిశ్ర‌మ‌ల అనుమ‌తుల‌కు సంబంధించి వివిధ కార్యాల‌యాల‌ను కూడా ఒకే చోట‌కు తీసుకువ‌స్తామ‌న్నారు. ప్రస్తుతం అద్దె భ‌వ‌నాల్లో ఉంటున్న జిల్లా కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి కార్యాల‌యం, ఇన్‌స్పెక్ట‌ర్ ఆఫ్ ఫ్యాక్ట‌రీస్ కార్యాల‌యాలు కూడా కొత్త‌గా నిర్మించే ప‌రిశ్ర‌మ‌ల కేంద్రం భ‌వ‌నంలోకి మారుస్తామ‌ని, అదేవిధంగా ఊరికి దూరంగా స‌త్రంపాడులో ఉన్న ఏపీఐఐసీ కార్యాల‌యం, టౌన్ ప్లానింగ్ రాజ‌మండ్రి కార్యాల‌యం కూడా ప‌రిశ్ర‌మ‌ల కేంద్రంలోకి తీసుకువ‌స్తామ‌ని, దీని వ‌ల్ల ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న కోసం వ‌చ్చే పారిశ్రామిక‌వేత్త‌ల‌కు అన్ని ర‌కాల కార్యాల‌యాలు ఒకే ప్రాంగ‌ణంలో ఉండ‌టం వ‌ల్ల అన్ని ర‌కాల అనుమ‌తులు అక్క‌డిక‌క్క‌డే పొందే వెసులుబాటు క‌లుగుతుంద‌న్నారు. రూ.5 కోట్ల‌తో నిర్మించే ఈ భ‌వ‌నంలో ఎగ్జిబిష‌న్ హాల్‌, ప్ర‌త్యేక క్యాంటీన్‌, ఇత‌ర మౌలిక వ‌స‌తులు క‌ల్పిస్తామ‌న్నారు. సొంత భ‌వ‌నం నిర్మించుకునే యోచ‌న‌లో ఉన్న కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి కార్యాల‌యానికి ఒక ఫ్లోర్ కేటాయిస్తామ‌న్నారు. త‌క్ష‌ణ‌మే స‌మ‌గ్ర భ‌వ‌న ప్లాన్ రూపొందిస్తే ప్ర‌భుత్వం నుంచి త్వ‌ర‌లోనే నిధుల‌ను విడుద‌ల చేయించి ప‌రిశ్ర‌మ‌ల కేంద్రం ఆధునిక భ‌వ‌న నిర్మాణానికి శ్రీ‌కారం చుడ‌తామ‌న్నారు.
ఏలూరు ఆటోన‌గ‌ర్లో ఖాళీగా ఉన్న 192 ప్లాట్‌ల‌ను త్వ‌ర‌లో భ‌ర్తీ చేయాల‌ని, ఎవ‌రికైతే ప్లాట్‌లు కేటాయిస్తారో వారంతా 180 రోజుల్లోగా నిర్మాణ ప‌నులు పూర్తి చేసుకోవాల‌ని, అలా చేసుకోక‌పోతే ఆ ప్లాట్‌ల‌ను మ‌రోక‌రికి కేటాయిస్తామ‌ని క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు. ఆటోన‌గ‌ర్‌లో 343 ప్లాట్‌ల‌కు గాను ఇప్ప‌టివ‌ర‌కు 76 ప్లాట్‌ల నిర్మాణ ప‌నులు పూర్తియి యూనిట్ల స్థాప‌న రిగింద‌ని, మ‌రో 75 ప్లాట్ల నిర్మాణ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని, వాస్త‌వంగా ఆటోమొబైల్ యూనిట్‌లు, మెకానిక్ యూనిట్‌లు క‌చ్చితంగా స్థాపించేవారికే ఈ ప్లాట్‌ల నిర్మాణం జ‌రుగుతుంద‌న్నారు. జిల్లాలో ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న కోసం ప్ర‌భుత్వ భూమి పొందిన పారిశ్రామిక‌వేత్త‌లు ఏడాదిలోగా ఉత్ప‌త్తి ప్రారంభించాల‌ని అలా కాని ప‌క్షంలో కేటాయించిన భూమి మ‌రోక‌రికి ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌న్నారు. జిల్లా ప‌రిశ్ర‌మ‌ల కేంద్రం ఇన్‌చార్జి డీఎం ఆదిశేషు, ఏపీఐఐసీ మేనేజ‌ర్ స‌త్య‌నారాయ‌ణ‌, ఇన్‌స్పెక్ట‌ర్ ఆఫ్ ఫ్యాక్ట‌రీస్ మోహ‌న‌రావు, టౌన్ కంట్రీ ప్లానింగ్ అధికారి కోట‌య్య‌, ఏపీఎస్ఎఫ్‌సీ మేనేర్ మాధ‌వ్‌, ట్రాన్స్‌కో డీఈ ర‌వికుమార్‌, డీపీవో కె.సుధాక‌ర్‌, కాలుష్య నియంత్ర‌ణాధికారి వెంక‌టేశ్వ‌ర్లు, సీపీవో బాల‌కృష్ణ పాల్గొన్నారు.