ads
Leela Narayana Pest Control
Sree VijayaLakshmi Textiles
For Suggestions

- విద్యార్థుల‌కు పిరికిత‌నం నూరిపోస్తున్నారా?
- క‌ష్ట‌ప‌డ‌వ‌ద్ద‌ని చెప్ప‌డం మంచిది కాదు
- భ‌విష్య‌త్తు కోసం ఏ దేశానికైనా వెళ్లి రాణించేలా తీర్చిదిద్దండి
- క‌ళాశాల అధిప‌తుల‌కు క‌లెక్ట‌ర్ క్లాస్‌
వెబ్ఏలూరు.కామ్ డెస్క్ : 'జంబ్లింగ్ వ‌ద్దా.. ఏం? పార‌ద‌ర్శ‌కంగానే జంబ్లింగ్ విధానం నిర్వ‌హిస్తున్నామే.. అభ్యంత‌రం దేనికి? విద్యార్థుల‌కు పిరికిత‌నం నూరిపోస్తున్నారా? క‌ష్ట‌ప‌డ‌వ‌ద్ద‌ని చెప్ప‌డం మంచిది కాదు.. ఒక క‌ళాశాల‌లో చ‌దువుతూ మ‌రో క‌ళాశాల‌కు వెళ్లి ప‌రీక్ష‌లు రాయమంటే బాధ‌ప‌డితే ఎలా? ఉన్న‌త చ‌దువుల కోసం, ఉద్యోగాల కోసం, భ‌విష్య‌త్తు కోసం ఏ దేశానికైనా వెళ్లి రాణించేలా విద్యార్థుల‌ను తీర్చిదిద్దాలే త‌ప్ప ప్ర‌తి దానికి కుంటిసాకులతో వారిలో నైరాశ్యాన్ని నింప‌కండి' అంటూ క‌లెక్టర్ కాటంనేని భాస్క‌ర్ క‌ళాశాల‌ల య‌జ‌మానుల‌కు క్లాస్ పీకారు. ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థుల‌కు జంబ్లింగ్ సౌక‌ర్యం వ‌ద్ద‌ని, దీని వ‌ల్ల విద్యార్థులు ఎంతో కష్ట‌ప‌డాల్సి వ‌స్తోంద‌ని ప‌లు క‌ళాశాల‌ల‌కు చెందిన అధిప‌తులు, విద్యార్థులు బుధ‌వారం క‌లెక్ట‌ర్‌ను క‌లిసి విన‌తిప‌త్రం అందించారు. దీనిపై క‌లెక్ట‌ర్ తీవ్రంగా స్పందించారు. విద్యార్థుల‌ను మ‌రింత క‌ష్ట‌ప‌డి చ‌దివేలా త‌ల్లిదండ్రులు క‌ళాశాల యాజ‌మాన్యం ప్రోత్స‌హించేలా త‌ప్ప వారిలో నిరాశ‌, నిస్పృహ‌లను క‌లిగించ‌వ‌ద్ద‌ని హిత‌వు ప‌లికారు. దీంతో క‌ళాశాల అధిప‌తులు, విద్యార్థులు ఇక‌పై క‌ష్ట‌ప‌డి చ‌దువుతామ‌ని వెనుదిరిగారు.