ads
Sree VijayaLakshmi Textiles
Leela Narayana Pest Control
For Suggestions
1

వెబ్ఏలూరు.కామ్ డెస్క్ : జిల్లా క్ష‌య నివార‌ణ విభాగంలో 2 వైద్యాధికారుల పోస్టుల‌ను కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు డీఎంహెచ్‌వో డాక్ట‌ర్ కె.కోటేశ్వ‌రి, జిల్లా క్ష‌య నివార‌ణాధికారి డాక్ట‌ర్ వి.వెంక‌ట‌రావు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌ద‌లుచుకున్న అభ్య‌ర్థులు ఫిబ్రవ‌రి 4వ తేదీలోగా త‌మ ద‌రఖాస్తుల‌ను ఏలూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలోని జిల్లా క్ష‌య‌నివార‌ణాధికారి కార్యాల‌యానికి రిజిస్ట‌ర్ పోస్టు ద్వారా అంద‌జేయాల‌ని కోరారు. ఈ ఉద్యోగాలు పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న మాత్ర‌మే భ‌ర్తీ చేయ‌బ‌డ‌తాయ‌న్నారు. ఇత‌ర వివ‌రాల కోసం ద‌ర‌ఖాస్తు కోసం www.westgodavari.org వెబ్‌సైట్ చూడాల‌ని కోరారు.