ads
Sree VijayaLakshmi Textiles
Leela Narayana Pest Control
For Suggestions
1

- క‌చ్చితంగా హెల్మెట్ ధ‌రించి ఇత‌రుల‌కు ఆద‌ర్శంగా నిల‌వాలి
- రాష్ డ్రైవింగ్ చేస్తే కేసు న‌మోదు చేస్తాం
- ఎస్పీ భాస్క‌ర్ భూష‌ణ్
- హెల్మెట్ బైక్ ర్యాలీకి జెండా ఊపి ప్రారంభం
- ట్రాఫిక్ వారోత్స‌వాల్లో భాగంగా ఏలూరు సిటీ ట్రాఫిక్ పోలీసులు ఆధ్వ‌ర్యంలో కార్య‌క్ర‌మం
వెబ్ఏలూరు.కామ్ డెస్క్ : రోడ్డు ప్ర‌మాదాల్లో హెల్మెట్‌లు లేక త‌ల‌కు గాయాల‌పాలై 75 శాతం మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయ‌ని ఎస్పీ భాస్క‌ర్ భూష‌ణ్ చెప్పారు. ట్రాఫిక్ వారోత్స‌వాల్లో భాగంగా ఏలూరు సిటీ ట్రాఫిక్ పోలీసులు చేప‌ట్టిన హెల్మెట్ బైక్ ర్యాలీని బుధ‌వారం ఆయ‌న ప్రారంభించారు. ద్విచ‌క్ర‌వాహ‌న‌చోద‌కులు తప్ప‌నిస‌రిగా హెల్మెట్ ధ‌రించాల‌ని, కారులో ప్ర‌యాణించేట‌పుడు సీటు బెల్టు పెట్టుకోవాల‌ని, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయ‌వ‌ద్ద‌ని హిత‌వు ప‌లికారు. రోడ్డు ప్ర‌మాదాల్లో హెల్మెట్లు లేక త‌ల‌కు తీవ్ర‌గాయాలై మ‌ర‌ణించిన వారి సంఖ్య పెరుగుతోంద‌ని, ఈ విష‌యంలో ప్ర‌తి ఒక్క‌రూ క‌చ్చితంగా హెల్మెట్‌లు ధ‌రించి ద్విచ‌క్ర‌వాహ‌నంపై వెళ్లాల‌ని ఆయ‌న హిత‌వు ప‌లికారు. కొంత‌మంది న‌గ‌రంలో అతివేగంతో ద్విచ‌క్ర‌వాహ‌నాలు నడుపుతున్నాని, అటువంటివారిని గుర్తించి జ‌రిమానా విధిస్తామ‌న్నారు. రెండోసారి కూడా తీరు మార‌కపోతే శిక్ష మ‌రింత పెంచుతామ‌న్నారు. అయినా రాష్ డ్రైవింగ్ చేస్తే కేసు న‌మోదు చేస్తామ‌ని హెచ్చ‌రించారు. న‌గ‌రంలో ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌ను క‌చ్చితంగా పాటిస్తామ‌ని, ముఖ్యంగా పోలీసులు కూడా ద్విచ‌క్ర‌వాహ‌నంపై వెళితే క‌చ్చితంగా హెల్మెట్ ధ‌రించి ఇత‌రుల‌కు ఆద‌ర్శంగా నిల‌వాల‌ని, జిల్లాలో పోలీసు సిబ్బంది, ఇత‌రులు కూడా హెల్మెట్ ధ‌రించి వాహ‌నాల‌ను న‌డ‌పాల‌ని ఆదేశించారు. స‌మాజంలో పోలీసులూ ఒక భాగ‌మేన‌ని, చ‌ట్టానికి ఎవ‌రూ అతీత‌లు కార‌ని, ఒక విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టిన‌పుడు దానిని స‌మాజంలో ప్ర‌తి ఒక్క‌రూ ఆచ‌రించాల‌ని, అపుడే ఆ విధానం విజ‌య‌వంత‌మ‌వుతుంద‌న్నారు. అద‌నపు ఎస్పీ వి.ర‌త్న‌, ఏలూరు డీఎస్పీ ఎం.వెంక‌టేశ్వ‌ర‌రావు, ఏలూరు ట్రాఫిక్‌ డీఎస్పీ ఎ.శ్రీ‌నివాస‌రావు, సీఐ పైడిబాబు, టౌన్ సీఐలు బంగార్రాజు, రాజ‌శేఖ‌ర్ పాల్గొన్నారు.