ads
Leela Narayana Pest Control
Sree VijayaLakshmi Textiles
For Suggestions
January 25, 2017 8:32 PM 309


- కేవ‌లం 60 నుంచి 65 శాతం మంది మాత్ర‌మే ఓటు హ‌క్కు వినియోగిస్తున్నారు
-క‌లెక్ట‌ర్ కాటంనేని భాస్క‌ర్
- కేపీడీటీ హైస్కూల్‌లో ఘ‌నంగా జాతీయ ఓట‌ర్ల దినోత్స‌వం
వెబ్ఏలూరు.కామ్ డెస్క్ : దేశ భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకుని ఓటు హ‌క్కును వినియోగించుకోవ‌డంలో దూరంగా ఉంటున్న విద్యావంతులు, యువ‌త త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోవాల‌ని క‌లెక్ట‌ర్ కాటంనేని భాస్క‌ర్ పిలుపునిచ్చారు. కేపీడీటీ హైస్కూల్‌లో బుధ‌వారం నిర్వ‌హించిన 7వ జాతీయ ఓట‌ర్ల దినోత్స‌వం కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడారు. ఓటు హ‌క్కు వినియోగం కేవ‌లం 60 నుంచి 65 శాతం మాత్ర‌మే ఉంద‌ని, ప్రజాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ‌కు ఇది ఎంత‌మాత్రం స‌రిపోద‌న్నారు. రాజ్యాంగం ఇచ్చిన ఓటు హ‌క్కును ఎట్టి ప‌రిస్థితుల్లోనూ సామాజిక బాధ్య‌త‌గా గుర్తెరిగి త‌ప్ప‌నిస‌రిగా వినియోగించుకోవాల‌న్నారు. జిల్లా న్యాయ‌సేవాధికార సంస్థ కార్య‌ద‌ర్శి ఎ.న‌రసింహమూర్తి మాట్లాడుతూ స‌మాజంలో ప్ర‌తి ఒక్క‌రూ ఎటువంటి ప్ర‌లోభాలకు లోనుకాకుండా నిర్భ‌యంగా క‌చ్చితంగా త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోవాల‌న్నారు. 2009 నుంచి ఏడేళ్లుగా జాతీయ ఓట‌ర్ల దినోత్స‌వాన్ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్వ‌హిస్తూ ఓటు హ‌క్కు, న‌మోదుపై ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకువ‌చ్చే కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంద‌న్నారు. ఎమ్మెల్యే బడేటి కోట రామారావు (బుజ్జి) మాట్లాడుతూ ఓటు హ‌క్కు ఉన్న ప్ర‌తి పౌరుడు పోలింగ్‌లో పాల్గొంటే మేలు చేసే ప్ర‌భుత్వాల‌ను ఎన్నుకోవ‌చ్చ‌న్నారు. న్యాయ‌మూర్తి న‌ర‌సింహ‌మూర్తి స‌భికుల‌తో ఓట‌ర్ల ప్ర‌తిజ్ఞ చేయించారు. సురేష్‌బ‌హుగుణ పోలీసు స్కూల, శ‌ర్వాణి పాఠ‌శాల‌ల విద్యార్థుల సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌లు, మిమిక్రీ ఆనంద్‌, కె.శ్రీ‌నివాస్ టాకింగ్ డాల్‌, ఎంఎల్ కృష్ణ‌బాబు జాన‌ప‌ద గేయాలు, నాట్యాచార్య గండికోట రాజేష్ శిష్య‌బృందం నృత్య‌రూప‌కాలు అల‌రించాయి. క‌స్తూరిబా విద్యార్థులు ఓటు హ‌క్కు వినియోగంపై చేసిన ప్ర‌ద‌ర్శ‌న ఆక‌ట్టుకుంది. తొలుత సీనియ‌ర్ ఓట‌ర్ల‌ను స‌త్క‌రించారు. కొత్త‌గా ఓట‌ర్లుగా న‌మోదైన వారికి ఎపిక్ కార్డుల‌ను అంద‌జేశారు. ర‌క్త‌దాన శిబిరంలో ఏలూరు ఆర్డీవో నంబూరి తేజ్‌భ‌ర‌త్, రామ‌చంద్ర ఇంజినీరింగ్ విద్యార్థులు ర‌క్త‌దానం చేశారు. హ‌స్త‌క‌ళ‌ల అభివృద్ధి సంస్థ చైర్మ‌న్ పాలి ప్ర‌సాద్‌, ఏలూరు ఎంపీపీ మోరు హైమావ‌తి, న‌గ‌ర డెప్యూటీ మేయ‌ర్ గుడివాడ రామ‌చంద్ర‌కిశోర్‌, న‌గ‌ర కోఆప్ష‌న్ స‌భ్యులు ఎస్ఎంఆర్ పెద‌బాబు, మునిసిప‌ల్ మాజీ చైర్మ‌న్ ఉప్పాల జ‌గ‌దీష్‌బాబు, ఉభ‌య‌గోదావరి జిల్లాల విద్యాశాఖాధికారి కె.వెంక‌టేశ్వ‌ర్లు, త‌హ‌సిల్దార్ చంద్ర‌శేఖ‌ర్‌, జిల్లా బాల‌ల సంర‌క్ష‌ణాధికారి సూర్య‌చ‌క్ర‌వేణి, ఎంపీడీవో సూర్య‌ప్ర‌కాశ‌రావు పాల్గొన్నారు.