ads
తాజా :
Leela Narayana Pest Control
Sree VijayaLakshmi Textiles
For Suggestions
January 26, 2017 8:31 PM 252


- వైసీపీ అధ్య‌క్షుడు ఆళ్ల‌ నాని స‌హా ప‌లువురు జిల్లా నాయ‌కులు అరెస్ట్‌
- ఏలూరు త్రీటౌన్ పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లింపు
- నాయ‌కుల విడుద‌ల కోరుతూ త్రీటౌన్ పోలీస్‌స్టేష‌న్‌ను ముట్ట‌డించిన‌ కార్య‌క‌ర్త‌లు
వెబ్ఏలూరు.కామ్ డెస్క్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైసీపీ ఆధ్వ‌ర్యంలో గురువారం సాయంత్రం చేప‌ట్టిన క్యాండిల్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ జిల్లా అధ్య‌క్షుడు ఆళ్ల నాని స‌హా ప‌లువురు జిల్లా, న‌గ‌ర నాయ‌కులను అరెస్ట్ చేసి త్రీ టౌన్ పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించారు. వారి వెంటే వైసీపీ కార్య‌క‌ర్త‌లు కొవ్వొత్తుల‌తో ప్ర‌ద‌ర్శ‌న‌గా చేరుకుని త్రీటౌన్ పోలీస్‌స్టేష‌న్‌ను ముట్ట‌డించారు. ఈ సంద‌ర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ ప్ర‌త్యేక హోదా సాధించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌లంద‌రూ స్వ‌చ్ఛందంగా ఉద్య‌మిస్తున్న నేప‌థ్యంలో సీఎం చంద్ర‌బాబునాయుడు త‌న స్వార్థం కోసం ప్ర‌జాప్ర‌యోజ‌నాల‌ను తాక‌ట్టుపెట్టి ఉద్య‌మాన్ని నీరుగార్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని మండిప‌డ్డారు. చంద్ర‌బాబుకు ఇది కొత్త కాద‌ని, గ‌తంలో జిల్లాలో కాల్ద‌రి కాల్పుల ఘ‌ట‌న‌, హైద‌రాబాద్‌లో రైతుల‌పై కాల్పులు ఘ‌ట‌న‌లు చంద్ర‌బాబు పాల‌న‌కు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. ఇప్పికైనా చంద్ర‌బాబు క‌ళ్లుతెరిచి ఉద్య‌మంలో భాగ‌స్వాములు కావాల‌న్నారు. ప్ర‌త్యేక హోదా సాధ‌న వైసీపీ అధినేత జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వ‌ల్ల‌నే సాధ్య‌మ‌న్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో వైసీపీ నాయ‌కులు మేకా శేషుబాబు, కొయ్యే మోషేన్‌రాజు, తానేటి వ‌నిత‌, పుప్పాల వాసుబాబు, పాత‌పాటి స‌ర్రాజు, కారుమూరి నాగేశ్వ‌ర‌రావు, కొఠారు రామ‌చంద్ర‌రావు, కోట‌గిరి శ్రీ‌ధ‌ర్‌, మ‌ధ్యాహ్న‌పు బ‌ల‌రామ్‌, గుడిదేశి శ్రీ‌నివాస‌రావు, మంచెం మైబాబు త‌దిత‌రులు ఉన్నారు.