ads
Sree VijayaLakshmi Textiles
Leela Narayana Pest Control
For Suggestions
1
January 26, 2017 9:12 PM 466


- కలెక్ట‌ర్ కాటంనేని భాస్క‌ర్
- ఏలూరు పోలీస్ పెరెడ్ గ్రౌండ్స్‌లో జాతీయ ప‌తాకావిష్క‌ర‌ణ, పోలీసుల గౌర‌వ వంద‌నం స్వీక‌ర‌ణ‌
- ఆక‌ట్టుకున్న సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌లు, ప్ర‌భుత్వ శాఖ‌ల శ‌క‌టాల ప్ర‌ద‌ర్శ‌న‌
- ఘ‌నంగా గ‌ణ‌తంత్ర వేడుక‌లు
వెబ్ఏలూరు.కామ్ డెస్క్ : దేశాన్ని అభివృద్ధి ప‌థంలోకి తీసుకువెళ్ల‌డం ద్వారానే న‌వ భార‌త నిర్మాణం కోసం త‌మ ప్రాణాల‌ర్పించిన ఆనాటి స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల‌కు మ‌న‌మిచ్చే నిజ‌మైన నివాళి అని కలెక్ట‌ర్ కాటంనేని భాస్క‌ర్ అన్నారు. 68వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా స్థానిక పోలీస్ పెరెడ్ గ్రౌండ్స్‌లో గురువారం జాతీయ ప‌తాకావిష్క‌ర‌ణ చేసి, పోలీసుల గౌర‌వ వంద‌నాన్ని క‌లెక్ట‌ర్ స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ స్వేచ్ఛా స‌మాన‌త్వం సౌభ్రాతృత్వం విలువ‌ల‌తో జీవించ‌డానికి ఈ గ‌ణ‌తంత్ర దినోత్స‌వం ఒక భూమిక‌ను ఏర్ప‌రిచింద‌ని, స్వేచ్ఛా స్వాతంత్ర్యాల‌తో దేశాన్ని స‌మున్న‌త శిఖ‌రాల‌కు తీసుకువెళ్ల‌డంలో అందరం స‌మ‌ష్టి కృషి చేయాల‌న్నారు. భార‌త రాజ్యాంగంపై 300 మంది రాజ్యాంగ నిర్మాత‌లు సంత‌కం చేయ‌గా, వారిలో మ‌న జిల్లా వాసి భోగ‌రాజు ప‌ట్టాభిసీతారామ‌య్య ఒక‌రుగా ఉండ‌టం చారిత్ర‌క విశేష‌మ‌న్నారు. ఏడు ద‌శాబ్దాల క‌ల‌గా మిగిలిన పోల‌వ‌రం ప్ర‌ధాన ప‌నుల‌ను రాష్ట్ర ముఖ్య‌మంత్రి గ‌త నెల‌లో ప్రారంభించ‌డం హ‌ర్షించ‌ద‌గిన విష‌య‌మ‌న్నారు. జిల్లా వ్య‌వ‌సాయం, అనుబంధ రంగాల‌లో రెండెంక‌ల వృద్ధి రేటు సాధించింద‌న్నారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ ప‌థ‌కం కింద 18,504 గృహాలు, ప్ర‌ధాన మంత్రి గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ఆవాస యోజ‌న ప‌థ‌కం కింద 7200 గృహ‌లు నిర్మిస్తున్నామ‌న్నారు. జిల్లాలో ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు పంట భూముల‌ను వినియోగించ‌కుండా 16వేల ఎక‌రాల అట‌వీ భూముల‌ను డీనోటిఫై చేసి పెద్ద ఎత్తున ప‌రిశ్ర‌మ‌లు స్థాపించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింద‌ని, వీటి కార‌ణంగా జిల్లాలో నిరుద్యోగ యువ‌త‌కు పెద్ద ఎత్తున ఉద్యోగ అవ‌కాశాలు ల‌భించే అవ‌కాశం ఉంద‌న్నారు. జిల్లా క‌లెక్ట‌ర్‌గా రిప‌బ్లిక్ డే వేడుక‌ల్లో మూడుసార్లు పాల్గొన్న కాటంనేని భాస్క‌ర్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వ విప్ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ఆయ‌న‌కు ప్ర‌త్యేకంగా పుష్ప‌గుచ్చం అందించి అభినందించారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు, జిల్లా జ‌డ్జి ఎన్‌.తుకారామ్‌జీ, న్యాయ‌మూర్తులు సాయిర‌మాదేవి, ర‌మాదేవి, ఎస్‌.శ్రీ‌దేవి, డి.ఉమాదేవి, ఏలూరు న‌గ‌ర మేయ‌ర్ షేక్ నూర్జ‌హాన్, డీఐజీ పీవీఎస్ రామ‌కృష్ణ‌, ఎస్‌పీ భాస్కర్ భూష‌ణ్‌, జేసీ పి.కోటేశ్వ‌ర‌రావు, ఏఏసీ ఎంహెచ్ ష‌రీఫ్, డీఆర్‌వో క‌ట్టా హైమావ‌తి, ఆర్డీవో నంబూరి తేజ్‌భ‌ర‌త్‌, న‌గ‌రపాల‌క సంస్థ కోఆప్ష‌న్ స‌భ్యులు ఎస్ఎంఆర్ పెద‌బాబు పాల్గొన్నారు. అనంత‌రం రూ.200 కోట్ల విలువైన ఉపక‌ర‌ణాల‌ను క‌లెక్ట‌ర్ భాస్క‌ర్, జిల్లా జడ్జి ఎన్‌.తుకారామ్‌జీ లబ్దిదారుల‌కు పంపిణీ చేశారు. దేశ‌భ‌క్తిని తెలియ‌జేస్తూ భాష్యం, ప్ర‌భుత్వ‌బాలికోన్న‌త పాఠ‌శాల‌, గ‌వ‌ర‌వ‌రం శ్రీ‌చైత‌న్య‌, భోగాపురం విజ్ఞాన్ గ్రీన్‌ఫీల్డ్ పాఠ‌శాల‌, ఏలూరు శ‌ర్వాణి త‌దిత‌ర విద్యాసంస్థ‌లకు చెందిన విద్యార్థులు ప్ర‌ద‌ర్శించిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకున్నాయి. వివిధ ప్ర‌భుత్వ శాఖ‌లు త‌మ శాఖ‌ల ద్వారా జ‌రుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్మాల ప్ర‌గ‌తిని తెలియ‌జేస్తూ చేసిన శ‌క‌టాల ప్ర‌ద‌ర్శ‌న ఆక‌ట్టుకున్నాయి.