ads
Sree VijayaLakshmi Textiles
Leela Narayana Pest Control
For Suggestions
1

- ప్ర‌ముఖ సంగీత క‌ళాకారులు బుద్ద‌దేవ్
- బుద్ధ‌దేవ్‌ను ఘనంగా స‌త్క‌రించి, న‌గ‌దు పుర‌స్కారం అంద‌జేసిన అంబికా రాజా
వెబ్ఏలూరు.కామ్ డెస్క్ : స్వ‌యంకృషికి, దీక్షాద‌క్ష‌త‌ల‌కు నిలువెత్తు రూపం స్వ‌ర్గీయ ఆల‌పాటి రామ‌చంద్ర‌రావు అని ప్ర‌ముఖ సంగీత క‌ళాకారులు బుద్ద‌దేవ్ అన్నారు. అంబికా ద‌ర్బార్‌బ‌త్తి వ్య‌వస్థాప‌కులు ఆల‌పాటి రామ‌చంద్ర‌రావు 91వ జ‌యంతి సంద‌ర్భంగా గురువారం స్థానిక ప‌వ‌రుపేట‌లోని ఆయ‌న నివాసంలో బుద్ధ‌దేవ్‌ను ఆల‌పాటి రామ‌చంద్రరావు కుమారుడు, రాష్ట్ర ఆర్య‌వైశ్య మ‌హాస‌భ ఉపాధ్య‌క్షులు అంబికా రాజా దుశ్శాలువాతో ఘనంగా స‌త్క‌రించి, న‌గ‌దు పుర‌స్కారం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా అంబికా రాజా మాట్లాడుతూ త‌మ తండ్రి ఆల‌పాటి రామ‌చంద్ర‌రావు జ‌యంతి సంద‌ర్భంగా బుద్ధ‌దేవ్‌ను స‌త్క‌రించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. ప్ర‌ముఖ నృత్య క‌ళాకారులు కెవి స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ ఆల‌పాటి రామ‌చంద్ర‌రావు గొప్ప కళాపోష‌కులు అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ కౌన్సిల‌ర్ మ‌జ్జి కాంతారావు, పైయిడేటి ర‌ఘు పాల్గొన్నారు.