ads
Sree VijayaLakshmi Textiles
Leela Narayana Pest Control
For Suggestions
1

- వ‌ట్లూరులోని స‌ర్ సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ క‌ళాశాల‌లో 5 విభాగాల్లో పోటీలు
- సీఆర్ రెడ్డి విద్యా సంస్థ‌ల అధ్య‌క్షులు కొమ్మారెడ్డి రాంబాబు, కార్య‌ద‌ర్శి ఎన్‌వీకే దుర్గారావు
- సీఆర్ రెడ్డి అడ్మినిస్ట్రేటివ్ కార్యాల‌యంలో విలేక‌రుల స‌మావేశంలో వెల్ల‌డి
వెబ్ఏలూరు.కామ్ డెస్క్ : వ‌ట్లూరులోని స‌ర్ సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ క‌ళాశాల‌లో ఈ నెల 28, 29 తేదీల్లో 44వ ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌ళాశాల‌ల అధ్యాప‌కుల ష‌టిల్ బ్యాడ్మింట‌న్ టోర్న‌మెంట్‌ను నిర్వ‌హిస్తున్న‌ట్టు సీఆర్ రెడ్డి విద్యా సంస్థ‌ల అధ్య‌క్షులు కొమ్మారెడ్డి రాంబాబు, కార్య‌ద‌ర్శి ఎన్‌వీకే దుర్గారావు చెప్పారు. సీఆర్ రెడ్డి అడ్మినిస్ట్రేటివ్ కార్యాల‌యంలో శుక్ర‌వారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో వారు మాట్లాడారు. సీఆర్ రెడ్డి విద్యా సంస్థ‌ల ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే ఈ పోటీల‌లో విశ్వ‌విద్యాల‌యాల అనుబంధ క‌ళాశాల‌లు, ఇంజినీరింగ్, మెడిక‌ల్‌, ఎడ్యుకేష‌న్‌, అగ్రిక‌ల్చ‌ర్‌, ఫార్మాసూటిక‌ల్స్, లా క‌ళాశాల‌ల అధ్యాప‌కులు పాల్గొంటార‌న్నారు. ఈ టోర్న‌మెంట్‌లో పురుషుల డ‌బుల్స్, వెట‌రన్స్ డ‌బుల్స్ (45-55 సంవ‌త్స‌రాలు), సూప‌ర్ వెట‌రన్స్ డ‌బుల్స్ (55 ఏళ్ల‌ పైబ‌డి), మ‌హిళ‌ల డ‌బుల్స్‌, మిక్స్‌డ్ డ‌బుల్స్ విభాగాల్లో పోటీలు నిర్వ‌హిస్తామ‌న్నారు. క్రీడాకారుల‌కు ఉచిత వ‌స‌తి, భోజ‌న స‌దుపాయాలు ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. టోర్న‌మెంట్‌ను ఈ నెల 28వ తేదీన ఉద‌యం 10.30 గంట‌ల‌కు ఎంపీ మాగంటి బాబు ప్రారంభిస్తార‌ని, 28వ తేదీ ఉద‌యం 9 గంట‌ల‌లోగా ఆస‌క్తి గ‌ల త‌మ పేర్లు న‌మోదు చేసుకోవాల‌ని కోరారు. విలేక‌రుల‌ స‌మావేశంలో విద్యా సంస్థ‌ల ఉపాధ్య‌క్షులు కాక‌రాల రాజేంద్ర‌వ‌ర‌ప్ర‌సాద్‌, క‌రస్పాండెంట్ యుఎస్ రామ్‌ప్రసాద్‌, కానాల శ్రీ‌నివాస్‌, క‌ళాశాల ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ జి.సాంబ‌శివ‌రావు, కేఎన్‌వీ స‌త్య‌నారాయ‌ణ‌, లేళ్ల వెంక‌టేశ్వ‌ర‌రావు పాల్గొన్నారు.