ads
Leela Narayana Pest Control
Sree VijayaLakshmi Textiles
For Suggestions

వెబ్ఏలూరు.కామ్ డెస్క్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ‌, స‌ర్ సీఆర్ రెడ్డి అటాన‌మ‌స్ క‌ళాశాల ఆధ్వ‌ర్యంలో ఈ నెల 28వ తేదీన మెగా జాబ్‌మేళా నిర్వ‌హిస్తున్న‌ట్టు సీఆర్ రెడ్డి విద్యా సంస్థ‌ల పాల‌క‌వ‌ర్గం అధ్య‌క్షులు కొమ్మారెడ్డి రాంబాబు చెప్పారు.  సీఆర్ రెడ్డి అడ్మినిస్ట్రేటివ్ కార్యాల‌యంలో శుక్ర‌వారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ఎమ్మెల్యే బ‌డేటి కోట‌రామారావు (బుజ్జి) చొర‌వ‌తో ఈ మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశామ‌న్నారు. ఈ జాబ్‌మేళాలో ప్ర‌ఖ్యాతి బ‌హుళ జాతి కంపెనీలు పాల్గొంటాయ‌న్నారు. 10వ త‌ర‌గ‌తి నుంచి పీజీ వ‌ర‌కు చ‌దివిన నిరుద్యోగ యువ‌త త‌మ విద్యార్హ‌త‌లు, బ‌యోడేటా ఈ జాబ్‌మేళాకు హాజ‌రుకావాల‌ని సూచించారు. అభ్య‌ర్థులు త‌మ పేర్ల‌ను www.jobskills.apssdc.in వెబ్‌సైట్‌లో న‌మోదు చేసుకుని, అడ్మిట్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చ‌న్నారు. ఇత‌ర వివ‌రాల కోసం 9603587268 నంబ‌ర్‌లో సంప్ర‌దించాల‌ని కోరారు.