ads
తాజా :
Leela Narayana Pest Control
Sree VijayaLakshmi Textiles
For Suggestions
January 27, 2017 9:01 PM 158


వెబ్ఏలూరు.కామ్ డెస్క్ : ప్ర‌త్యేక హోదా ఉద్య‌మంలో పాల్గొనేందుకు విశాఖ‌ప‌ట్ట‌ణం వెళ్లిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై ప్ర‌భుత్వ నిరంకుశ వైఖ‌రిని నిర‌సిస్తూ శుక్ర‌వారం స్థానిక వ‌సంత‌మ‌హ‌ల్ సెంట‌ర్‌లో పొట్టి శ్రీ‌రాములు విగ్ర‌హం వ‌ద్ద‌ వైసీపీ న‌గ‌ర శాఖ ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు నోటికి న‌ల్ల‌రిబ్బ‌న్లు ధ‌రించి నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. తొలుత పొట్టి శ్రీ‌రాములు విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప‌ట్ల ప్ర‌భుత్వ నిరంకుశ వైఖ‌రి న‌శించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించి మౌన ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో నాయ‌కులు గుడిదేశి శ్రీ‌నివాసరావు, పైడి భీమేశ్వ‌ర‌రావు, కార్పొరేట‌ర్లు క‌ర్రి శ్రీ‌నివాస్‌, జిజ్జువ‌ర‌పు ప్ర‌తాప్‌, పోత‌ర్లంక ల‌క్ష్మ‌ణ్‌, సిరిప‌ల్లి ప్ర‌సాద్‌, మంచెం మైబాబు, బొద్దాని శ్రీ‌నివాస్‌, మ‌న్నుల జాన్‌గురునాథ్‌, దాస‌రి ర‌మేష్‌, బోడా కిర‌ణ్‌కుమార్‌, మ‌ధ్యాహ్న‌పు ప్ర‌భాక‌ర్‌, మాకినేని వెంక‌టేశ్వ‌ర‌రావు, బ‌ట్టు విజ‌య‌ల‌క్ష్మి,  రొయ్యూరు స‌తీష్‌, రాజ‌నాల కిర‌ణ్‌, కిలార‌పు ఫ‌ణి, షేక్ ప్ర‌సాద్‌, రామిశెట్టి ఉద‌య‌భాస్క‌ర్ పాల్గొన్నారు.