ads
Sree VijayaLakshmi Textiles
Leela Narayana Pest Control
For Suggestions
1
January 27, 2017 9:02 PM 491


- న‌ట‌న, మోడ‌లింగ్ కెరీర్‌గా ఎంచుకునే మ‌హిళ‌ల‌కు ఈ పోటీలు దోహ‌దం
- ఎమ్మెల్యే బడేటి కోట రామారావు (బుజ్జి)
- అంబికా ఫ్లేవ‌ర్స్‌లో పోటీల‌ ఆడిష‌న్స్.. నిర్వాహ‌కులు చైత‌న్య‌రాణి
- అంబికా ఫ్లేవ‌ర్స్‌లో విలేక‌రుల స‌మావేశంలో వెల్ల‌డి
వెబ్ఏలూరు.కామ్ డెస్క్ : న‌గ‌రంలోని స‌ర్‌ సీఆర్ ఆర్ ఆడిటోరియంలో ఫిబ్ర‌వ‌రి 11వ తేదీన సాయంత్రం 6 గంట‌ల‌కు మిస్ ఏలూరు పోటీలు నిర్వ‌హిస్తున్న‌ట్టు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు (బుజ్జి) చెప్పారు. శుక్ర‌వారం అంబికా ఫ్లేవ‌ర్స్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో బ‌డేటి మాట్లాడుతూ తెలుగువాళ్లు చాలా అందంగా ఉంటార‌ని, అయితే మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ వంటి పోటీల్లో ఆంధ్రుల‌కు త‌గిన స్థానం ల‌భించ‌డం లేద‌న్నారు. తెలుగు సినిమాల్లో సైతం నార్త్ ఇండియ‌న్ హీరోయిన్లకే అవ‌కాశాలు ల‌భిస్తున్నాయ‌న్నారు. గ‌తంలో జ‌య‌ప్ర‌ద‌, జ‌య‌సుధ‌, శ్రీ‌దేవి వంటి తెలుగు హీరోయిన్లు తెలుగు సినిమాల్లో రాణించి అనంత‌రం హిందీ చిత్రాల్లో న‌టించార‌న్నారు. తెలుగు భాష రాని వారు కూడా తెలుగులో అవ‌కాశాలు చేజిక్కించుకుంటున్నార‌న్నారు. ఈ నేప‌థ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మిస్ ఇండియా, మిస్ యూనివ‌ర్స్ వంటి పోటీల‌కు సిద్ధం కావాల‌న్నారు. న‌ట‌న, మోడ‌లింగ్ కెరీర్‌గా ఎంచుకునే మ‌హిళ‌ల‌కు ఇటువంటి పోటీలు ఎంత‌గానో దోహ‌దం చేస్తాయ‌న్నారు. మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ మాట్లాడుతూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు గుర్తింపు తెచ్చే ఇటువంటి పోటీల‌ను ప్రోత్స‌హించాల‌న్నారు. జాతీయ‌, అంత‌ర్జాతీయ అందాల పోటీల్లో తెలుగు అమ్మాయిలు త‌మ స‌త్తా చూపించాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మం నిర్వాహ‌కురాలు మోనా ఫొటోగ్ర‌ఫి, యాడ్ ఏజెన్సీ డైరెక్ట‌ర్ చైత‌న్య‌రాణి మాట్లాడుతూ తాము గ‌తంలో విజ‌యవాడ‌, రాజ‌మండ్రిల‌లో మిస్ విజ‌య‌వాడ‌, మిస్ రాజ‌మండ్రి పోటీల‌ను విజయ‌వంతంగా నిర్వ‌హించామ‌న్నారు. ఈ పోటీల‌పై అన్ని మ‌హిళా కళాశాల‌ల్లో ప్ర‌చారం చేస్తున్నామ‌న్నారు. ఈ పోటీల‌కు సంబంధించి ఆడిష‌న్స్ కొత్త బ‌స్టాండ్ వ‌ద్ద గ‌ల అంబికా ఫ్లేవ‌ర్స్ హోట‌ల్‌లో జ‌రుగుతాయ‌న్నారు. 18 నుంచి 25 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు క‌లిగి ఆసక్తి ఉన్న‌ యువ‌తులు త‌మ‌ను సంప్ర‌దించాల‌ని కోరారు. అభ్య‌ర్థినులు త‌మ వ‌య‌స్సును తెలిపే ఆధార్ కార్డ్‌, పాన్ కార్డు, ఫొటోల‌తో ఆడిష‌న్స్‌కు హాజ‌రుకావాల‌న్నారు. ఇత‌ర వివ‌రాల‌కు 81433 33678నంబ‌ర్‌లో సంప్ర‌దించాల‌ని కోరారు.