ads
Sree VijayaLakshmi Textiles
Leela Narayana Pest Control
For Suggestions
1

వెబ్ ఏలూరు.కామ్ డెస్క్ : ప్రపంచ మానవతా మూర్తి మథర్‌ ధెరిస్సా బాటలో పయనిస్తూ పేదల‌ సంక్షేమానికి కృషి చేస్తున్న యువభారత మథర్‌ థెరిస్సా సేవా సంఘం సభ్యుల‌ అభినందనీయుని ఏూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి అన్నారు. సంఘం తొమ్మిదవ వార్షికోత్సవ వేడుకలు నగరంలోని కబాడీగూడెం బాబు జగ్జీవన్‌రామ్ కాల‌నీలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సభకు ఎస్సీ, ఎస్టీ నాయకుడు మేతర ఆజయ్‌బాబు అధ్యక్షత వహించగా, ఎమ్మెల్యే బడేటి బుజ్జి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బడేటి బుజ్జి మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాలుగా యువభారత్‌ మథర్‌ ధెరిస్సా సేవా సంఘం పేదల‌ సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. అపదలో ఉన్నవారిని ఆదుకోవడమే కాకుండా ప్రమాదాల‌కు గురైనా వారికి స్వచ్ఛందంగా రక్తదానం చేసి వారి ప్రాణాలు కాపాడటం హర్షణీయమన్నారు. కుల‌మతాల‌కు అతీతంగా, అందరూ ఆనందంగా ఉన్నప్పుడే ఈ సమాజం వేగవంతంగా అభివృద్ది చెందుతుందన్నారు. పేదల‌ కోసం తాను బడేటి శ్రీహరిరావు ట్రస్టును ఏర్పాటు చేసి ప్రతీ ఏడాది ల‌క్షలాది రూపాయలు విద్యార్ధుల‌కు, పేదల‌కు, వృద్దుల‌కు ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. ఇదే విధంగా యువభారత్‌ మథర్‌ థెరిస్సా సేవా సంఘం కూడా పేద సంక్షేమానికి సహాయ సహకారాు అందిస్తూ ఆదర్శంగా నిుస్తుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి బుజ్జి 45 వే రూపాయు ఆర్ధిక సహాయం, యువభారత్‌ మథర్‌ థెరిస్సా సేవా సంఘం 25 వే రూపాయు ఆర్ధిక సహాయంతో భౌతికకాయాను భద్రపరిచే ఫ్రీజర్‌ బాక్స్‌ను ప్రారంభించారు. ఈ ఫ్రీజర్‌ బాక్స్‌ ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. అలాగే యువభారత్‌ మథర్‌ థెరిస్సా సేవా సంఘం ఆర్ధిక సహాయంతో ఐదు వందల‌ మంది వృద్దులు, పేదల‌కు దుప్పట్లు, వస్త్రాల‌ను ఎమ్మెల్యే బడేటి బుజ్జి చేతుల‌ మీదుగా అందజేసారు. అలాగే సంఘం వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ముగ్గుల‌ పోటీల్లో విజేతల‌కు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి ఛైర్మన్‌ పూజారి నిరంజన్‌, యువభారత్‌ మథర్‌ థెరిస్సా సేవా సంఘం వ్యవస్థాపకుడు కాశీ కృష్ణ, అధ్యక్షు కాశీ శివ, ఉపాధ్యక్షుడు వెంకటరమణ, కార్యదర్శి కాశీ సత్యనారాయణ, సహాయ కార్యదర్శి తిరివీదు శ్రీను, కోశాధికారి త్లె నర్సయ్య, ప్రచార కార్యదర్శి చవటపల్లి దావీదు, సభ్యు పెనుమూరి రమేష్‌, కాశీ శివాజీ, నేదూరి దుర్గారావు, బోను రమేష్‌, బి. బ్రహ్మణ, కొపర్తి చంటి, జానకూటి వెంకన్న, మానుకొండ గంగాధరరావు పాల్గొన్నారు.