వెబ్ ఏలూరు.కామ్ డెస్క్ : మాదిగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని విస్మరించి మోసం చేస్తుందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్ఆర్పిఎస్) జిల్లా ఇన్చార్జి ఏటుకూరి విజయకుమార్ మాదిగ ఆరోపించారు. ఎమ్ఆర్పిఎస్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నగరంలోని సంఘం కార్యాలయంలో ఏలూరు నగర ఇన్చార్జి కాశీ కృష్ణ మాదిగ అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న విజయకుమార్ మాదిగా మాట్లాడుతూ మాదిగ జాతికి గుర్తింపు, ఆత్మగౌరవాన్ని సాధించి పెట్టిన ఎంఆర్పిఎస్ జాతీయ వ్యవస్థాపకుడు మందాకృష్ణ మాదిగను విమర్శించే స్థాయి మంత్రి జవహర్‌కు లేదన్నారు. మాదిగ జాతిని జవహర్ అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. కొవ్వూరు నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు మాదిగ జాతికి ఉన్నాయని, ఆ ఓట్లతోనే జవహర్ ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. ఈ రోజు మాదిగలు ఆర్ధికంగా, విద్యాపరంగా, రాజకీయంగా ఎదగారని, అభివృద్ది సాధించారని, 24 సంవత్సరాల క్రితం మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ను స్థాపించి అప్పటి నుంచి ఉద్యమిస్తున్నారన్నారు. ఇటువంటి మహనేతపై మంత్రి జవహర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ నె 17వ తేదీన హైదరాబాద్‌లోని ఎంఆర్పిఎస్ కార్యాలయంలో అమరులైన ఎంఆర్పిఎస్ మహిళా నాయకురాలు దర్శినా భారతి మాదిగ సంతాప సభను మందకృష్ణ మాదిగ నాయకత్వంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సభకు వేలాది మంది ఎంఆర్పిఎస్ కార్యకర్తలు తరలి రావాలని సూచించారు. అనంతరం మందకృష్ణ మాదిగపై మంత్రి జవహర్ చేసిన వ్యాఖ్యకు నిరసనగా నినాదాలు చేసారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా అధికార ప్రతినిధి యర్రా నాగమల్లేశ్వరరావు, నాయకులు ఇనపనూరి జగదీష్, పలివె చంటి, కాశీ శివ, టి. కిషోర్, కందు రమేష్, త్లె నర్సియ్య, తిరివీదు శ్రీను, ఇనపనూరి శ్రీనివాస్, కాశీ శివాజీ, జుజ్జురి మేరీ తదితయి పాల్గొన్నారు.
తాజా :
- బంధువుల చెంతకు బాలుడు
- 24న నగరపాలక సంస్థ అత్యవసర సమావేశం
- పెద్దాస్పత్రికి రూ.కోటి నిధి సమకూరుస్తాం
- సాగునీటి ప్రాజెక్టులు కాంట్రాక్టర్ల కోసం కాదు..
- పోలవరం పూర్తికి రూ.55వేల కోట్లు ఇంకా అవసరం
- నదుల అనుసంధానంతో రెండు కోట్ల ఎకరాలకు నీరు
- ఏలూరులో ఎంసెట్ రాసి తిరిగి ఇంటికి వెళుతూ..
- ఈ ఫొటోలో బాలుడు మీకు తెలుసా
- హామీల అమలులో టిడిపి ప్రభుత్వం దగా
- చినవెంకన్న నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం