ads
Sree VijayaLakshmi Textiles
Leela Narayana Pest Control
For Suggestions
1

వెబ్ ఏలూరు.కామ్ డెస్క్ : సమాజంలో ప్రతీ పేదవాణ్ని ఆదుకోవడమే తమ ప్రభుత్వ ల‌క్ష్యమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి అన్నారు. ఈ సందర్భంగా మార్కెట్‌లో రోడ్డు పక్కన నాటుకోళ్ళు అమ్ముకుంటున్న వారికి మార్కెట్‌లో స్థానం కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్క పేదవాణ్ని ఆదుకోవడానికి తమ ప్రభుత్వ ఎల్ల‌ప్పుడూ ముందుంటుందన్నారు. ఎవ‌రికీ ఏ కష్టం వచ్చిన తాము ఆదుకుంటామని తెలిపారు. స్థానిక 6వ డివిజన్‌లో కార్పొరేటర్‌ గోపీ ఆధ్వర్యంలో తమకు ఎమ్మెల్యే బడేటి బుజ్జిచే మాకు స్థలం ఇప్పించార‌ని అందుకు గాను నాటుకోళ్ళ వర్తక సంఘం ప్రెసిడెంట్‌ పాలిక నూకరాజు, సెక్రటరీ యర్రా అవతారం, వైస్‌ ప్రెసిడెంట్‌ చుక్కాసింహాచలం ప్రత్కేక కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకూ తమ వ్యాపారం రోడ్డుపై సాగిందని, ఎమ్మెల్యే బడేటి బుజ్జి, నగర మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ పెదబాబు సహాయ సహకారాల‌తో మార్కెట్‌లో మాకు స్థలం ఏర్పాటు చేయడమే కాకుండా మా జీవనానికి దారి చూపించారన్నారు. ఈ సందర్భంగా వారు బడేటి బుజ్జిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాటు కోళ్ళ వ్యాపారస్థులు తదితయి పాల్గొన్నారు.