ads
Sree VijayaLakshmi Textiles
Leela Narayana Pest Control
For Suggestions
1
galigopuram

వెబ్ ఏలూరు.కామ్ డెస్క్ : జిల్లాలో పరిశ్రమలు స్ధాపించడానికి ముందుకువచ్చేపారిశ్రామికవేత్తల‌కు 14 రోజుల్లో అన్నీరకాల‌ అనుమతులు మంజూరు చేస్తామని కలెక్టరు కాటంనేని భాస్కర్‌ చెప్పారు. స్ధానిక కలెక్టరు కార్యాయంలో బుధవారం జిల్లాపరిశ్రమ ప్రోత్సాహక మండలి సమావేశానికి కలెక్టరు అధ్యక్షత వహించారు. జిల్లాలో పరిశ్రమల‌ స్ధాపనకు ఎంతో అనువైన వాతావరణం ఉన్నదని ముఖ్యంగా వ్యవసాయ, అనుబంధ రంగాల‌లో అనేక క్రొత్త పరిశ్రమలు స్ధాపించడానికి అవసరమైన వనరులు కూడా ఉన్నాయని ఇటువంటి స్ధితిలో పారిశ్రామికవేత్తలు ప్రాజెక్టు నివేదికతో అన్నీరకాల‌ సర్టిఫికెట్లు కలిగి ఉంటే ధరఖాస్తుచేసిన 14 రోజుల్లో వివిధ శాఖల‌కు చెందిన అన్నీ అనుమతుల‌ను సింగిల్‌ విండో ద్వారా ఇచ్చి పరిశ్రమల‌ స్ధాపనకు అనుమతులు ఇస్తామని కలెక్టరు చెప్పారు. ఏలూరు సవిూపంలోని వట్లూరులో ఏర్పాటుచేసే భారీపరిశ్రమల‌కు ఇంకా అవసరమైన 19.69 ఎకరాల‌ భూమిని కూడా సమకూర్చడానికి చర్యలు తీసుకున్నామని పెదవేగి మండలం రామశింగవరం గ్రామంలో 173 ఎకరాల‌లో పరిశ్రమ స్ధాపనకు చర్యలు తీసుకున్నామని ఈమేరకు ఏపిఐఐసి తగు చర్యలు చేపట్టిందని ఆయన చెప్పారు. సమావేశంలో జిల్లా పరిశ్రమ శాఖా జనరల్‌ మేనేజర్‌ త్రిమూర్తులు, ఉపసంచాకులు ఆదిశేషు, డిపివో ముళ్లపూడి వెంకటరమణ, వాణిజ్యపన్నుశాఖా డిప్యూటి కమిషనరు రాజశేఖర్‌, సాంఘిక సంక్షేమశాఖ డిడి రంగక్ష్మీదేవి, తదితయి పాల్గొన్నారు.