ads
Sree VijayaLakshmi Textiles
Leela Narayana Pest Control
For Suggestions
1

వెబ్ ఏలూరు.కామ్ డెస్క్ : మ‌ల్బ‌రీ సాగులో ల‌క్ష్యాల‌ను అధిగమిస్తున్నట్లు కాకిలెక్కల‌తో కాల‌క్షేపమా?  ఈమతల‌బు ఏమిటీ?  తప్పుడు సమాచారం ఇవ్వడం కూడా ఒక అవినీతి కిందే వస్తుందని ఈవిషయంలో సమగ్ర విచారణ జరిపి సంబంధిత అధికారుల‌ను జైలుకు పంపడమే తప్ప మరొక మార్గం లేదని కలెక్టరు భాస్కర్‌ స్పష్టం చేసారు. స్ధానిక కలెక్టరు కార్యాయంలో బుధవారం ప్రాధాన్యతా రంగాల‌ ప్రగతి తీరుపై వివిధ శాఖ అధికారుతో ఆయన సవిూక్షించారు. జిల్లాలో మ్భరీసాగుకు ఎ న్నో అవకాశాు ఉన్నాయని అయితే పట్టుపరిశ్రమ శాఖ అధికాయి జిల్లాలో క్షేత్రస్ధాయిలో తిరగకుండా రైతుల‌ను చైతన్య పరచకుండా ల‌క్ష్యాల‌ను అధిగమిస్తున్నట్లు వారం వారం తప్పుడు లెక్కలు సమర్పిస్తున్నారని ఇటీవల‌ ఆర్ధిక గణాంకాల‌ను పరిశీలించగా అసలు వాస్తవం బయటపడిందని భాస్కర్‌ చెప్పారు. ఇతర శాఖల‌ ఉద్యోగులు, అధికారులు కన్నా సైంటిష్టు హోదాలో జీతాలు కూడా అధికంగా తీసుకుంటూ మొత్తం 19 మంది పట్టుపరిశ్రమలో పనిచేస్తూ కనీసం ఏడాదిలో 200 ఎకరాలు కూడా మ‌ల్బ‌రీసాగు అదనంగా చేయకపోవడాన్ని కలెక్టరు తప్పుపట్టారు. తీసుకుంటున్న జీతానికి న్యాయంచేసేలా పనిచేయాలే తప్ప నిర్ధేశించిన ల‌క్ష్యాల‌ను క్షేత్రస్ధాయిలో నెరవేర్చకుండా ఆఫీసుల్లో కూర్చుని దొంగలెక్కలు రాస్తారా ?  ఇప్పటికే సంబంధిత అధికారుల‌కు ఇచ్చిన షోకాజ్‌ నోటీసుల‌ను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని కలెక్టరు హెచ్చరించారు.  2016-17 ఆర్ధిక సంవత్సరంలో జిల్లాలో 800 ఎకరాల్లో మ‌ల్బ‌రీ తోటలు పెంచినట్లు తనకు నివేదిక సమర్పించారని కానీ ఆర్ధిక గణాంకాల‌తో పోల్చ‌గా 150 ఎకరాల్లో మాత్రమే మ‌ల్బ‌రీ సాగు చేసారని, అదేవిధంగా 2017-18 ఆర్ధిక సంవత్సరంలో 2 వేల‌ ఎకరాల‌లో మ‌ల్బ‌రీ తోటలు పెంచినట్లు, 600 షెడ్డులు నిర్మించినట్లు నివేదికలో పొందుపరిచారని కానీ వాస్తవంగా 192 ఎకరాలో మ‌ల్బ‌రీ సాగు, 50 షెడ్డులు నిర్మించినట్లు ఆర్ధిక గణాంకాలు వెల్ల‌డిస్తున్నాయన్నారు. వర్షాకాల సీజన్‌లో పశుగ్రాసక్షేత్రాలు పెంచకుండా నేడు వేసవిలో పశుగ్రాసం పెంచుతామంటూ ఒక ప్రణాళికను సిద్ధం చేయడం ప్రభుత్వ సొమ్మును స్వాహా చేయడానికి కాదా? 42 డిగ్రీల‌ వేసవిలో పశుగ్రాసం ఎలా పెరుగుతుందని కలెక్టరు పశుసంవర్ధకశాఖ జాయింట్‌ డైరెక్టరు శ్రీనివాసరావును ప్రశ్నించారు. చెప్పిన సమయంలో చేయకుండా పశుగ్రాసం పెంచడానికి లీజు పేరుతో ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేసే బోగస్‌ పనుల‌కు ప్రాధాన్యత ఇవ్వవద్దని ఆయన సూచించారు. సమావేశంలో అడిషినల్‌ జేసి యంహెచ్‌.షరీఫ్‌, నాబార్డు ఎజియం రామప్రభు, మార్క్‌ఫెడ్‌ డియం నాగమల్లిక, ఉద్యాన శాఖ అధికారి సుబ్బారావు, దుర్గేష్‌, మైక్రో ఇరిగేషన్‌ పిడి నాయక్‌, మత్స్యశాఖా జేడి అంజలి పాల్గొన్నారు.