ads
Sree VijayaLakshmi Textiles
Leela Narayana Pest Control
For Suggestions
1
galigopuram

వెబ్ ఏలూరు.కామ్ డెస్క్ : పశ్చిమ గోదావరి జిల్లాలో రైతుందరికీ జూన్‌ 1వ తేదీ నాటికల్లా భూసార ఆరోగ్య పరీక్షా కార్డులు అందించాల‌ని జిల్లా కలెక్టరు కాటంనేని భాస్కర్‌ వ్యవసాయ అధికారుల‌ను ఆదేశించారు. స్ధానిక కలెక్టరు కార్యాల‌యంలో బుధవారం మండల‌ వ్యవసాయ అధికారుల‌ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రగతితీరుపై కలెక్టరు సవిూక్షించారు. జూన్‌ 1వ తేదీ నుండి ఖరీఫ్‌ పంటకు కాల్వ‌ ద్వారా నీటిని విడుదల‌ చేస్తున్న దృష్ట్యా రైతులు తమ పొలాల్లో ఏర్పడ్డ ఖనిజ లోపాల‌ను ముందుగా తెలుసుకుని అవసరమైన ఖనిజ ల‌వణాల‌ను వేసుకోవడానికి ఈభూసార ఆరోగ్య పరీక్షా కార్డులు ఎంతో దోహదపడతాయని కలెక్టరు చెప్పారు. జిల్లాలో 2 ల‌క్షల‌ 56 వేల‌ 698 మంది రైతుల‌కు భూసార ఆరోగ్య పరీక్షా కార్డులు అందించాల్సి ఉండగా ఇప్పటివరకూ ల‌క్షా 70 వేల‌ 698 కార్డులు మాత్రమే ఇచ్చారని మిగిలిన 86 వేల‌ కార్డుల‌ను జూన్‌ 1వ తేదీ నాటికల్లా రైతుల‌కు అందించి తీరాల‌ని కలెక్టరు ఆదేశించారు. శాస్త్రీయ విధానం ద్వారా పంటపొలాల‌కు ఖనిజాలు సమకూరిస్తే రైతుకు ఎంతో మేలు జరుగుతుందని అవసరమైన బోరాన్‌, జింకు నిల్వ‌ల‌ను సిద్ధం చేసుకుని రైతుల‌కు సకాలంలో అందించాల‌ని ఆదేశించారు. గత ఏడాది ఖరీఫ్‌ పంటకాలంలో 636 కోట్ల రూపాయల‌ రుణాల‌ను కౌలు రైతుల‌కు ఇచ్చినా వాటిని మళ్లీ రెన్యువల్‌ చేయించాల‌ని అదనంగా మరో 800 కోట్లు క్రొత్త రైతుల‌కు అందించి కౌలు రైతుల‌కు మేలు చేయాల‌ని కలెక్టరు ఆదేశించారు. జూన్‌ 2వ వారం నాటికల్లా కనీసం 25 శాతం రుణాల‌ను అప్పగిస్తే సేద్యపు పనులు చేసుకోగలుగుతారని కలెక్టరు చెప్పారు. ఖరీఫ్‌ పంటకు అవసరమైన విత్తనాలు, ఎరువుల‌ను కూడా సిద్ధం చేయాల‌ని ఏఒక్క రైతు ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ అధికారుల‌పై ఉందని చెప్పారు. జూన్‌ 1వ తేదీన కాల్వ‌ ద్వారా నీరు విడుదల‌ చేస్తున్న దృష్ట్యా రైతాంగం వరినారుమఢులు సిద్ధం చేసుకుని సకాలంలో నాట్లు వేసుకోవాల‌ని కలెక్టరు సూచించారు. నాట్లు ఆల‌శ్యం అయితే పంట చేతికి వచ్చే సమయంలో తుఫాన్, వరద సంభవిస్తే పంట నష్టపోయే ప్రమాదం ఉన్న దృష్ట్యా రైతులను ముందుగానే సన్నద్ధం చేయాల‌ని సూచించారు. రైతురథం పధకం క్రింద గత ఏడాది 1100 ట్రాక్టర్లను రైతుకు పంపిణీ చేస్తే ఈఏడాది 1500 ట్రాక్టర్లు రైతుల‌కు అందించేందుకు ఒక ప్రణాళిక సిద్ధంచేయాల‌ని ఇదేవిధంగా ఒక దశాబ్దం పాటు అమలు చేస్తే జిల్లాలో మెజారిటీ రైతుల‌కు ట్రాక్టర్లు అందుబాటులోనికి వస్తాయన్నారు. జిల్లా అదనపు జేసి యంహెచ్‌.షరీఫ్‌, వ్యవసాయ శాఖ జేడి గౌసియాబేగం, మండల‌ వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.