ads
Sree VijayaLakshmi Textiles
Leela Narayana Pest Control
For Suggestions
1
galigopuram

వెబ్ ఏలూరు.కామ్ డెస్క్‌ : రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం క్రైస్తవులంతా ప్రార్ధనలు చేయాల‌ని నగర మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ కోరారు. స్థానిక వెంకటాపురం పంచాయతీలోని క్రీస్తురాజుపురం కాల‌నీలో పున:నిర్మించిన సెయింట్‌ ఆల్ఫోన్సమ్మ ఆర్‌సిఎం దేవాయాన్ని గురువారం ప్రారంభించారు. ఈ దేవాల‌య నిర్మాణానికి ప్రముఖ వ్యాపారవేత్త మడుపల్లి మోహనగుప్తా రూ. ల‌క్ష ఆర్ధిక సహాయం అందించగా, ఎస్‌ఎంఆర్‌ రియల్‌ ఎస్టేట్‌ అధినేత, కోఆప్షన్‌ సభ్యులు ఎస్‌ఎంఆర్‌ పెదబాబు, దేవాల‌య ఎలివేషన్‌, టైల్స్‌ను అందించారు.  ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మేయర్‌ మాట్లాడుతూ చర్చి నిర్మాణంలో తమను భాగస్వాముల‌ను చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా క్రైస్తవుల‌ అభివృద్ధికి తాము ఎంతో సహకారం అందించామన్నారు. ముఖ్యంగా క్రైస్తవులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కోట్ల రూపాయలు వెచ్చించి మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. సమాజంలో శాంతి కోసం ప్రతీ ఒక్కరూ ఆ ప్రభువును ప్రార్ధించాల‌ని సూచించారు. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం క్రైస్తవలు ప్రార్ధనలు చేయాల‌ని ఆమె కోరారు. కోఆప్షన్‌ సభ్యులు ఎస్‌ఎంఆర్‌ పెదబాబు, డిప్యూటీ మేయర్‌ నాయుడు పోతురాజు, మాజీ డిప్యూటీ మేయర్‌ చోడే వెంకటరత్నం, గుడివాడ రామచంద్రకిషోర్‌, గుప్తా సంస్థ మేనేజర్‌ శ్రీనివాస్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫాదర్‌ పీటర్‌, రామకృష్ణ మాస్టర్‌, ఖండవల్లి నాగరాజు, ఖండవల్లి ఏసు, బాబూరావు, ప్రసాద్‌, ప్రభాకర్‌, రాజశేఖర్‌, సురేష్‌, రంగారావు పాల్గొన్నారు.