ads
Sree VijayaLakshmi Textiles
Leela Narayana Pest Control
For Suggestions
1

ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి
వెబ్ ఏలూరు.కామ్ డెస్క్ : తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో అప్పుడే ఎన్నిక సందడి మొదలైందని, కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు అన్నారు. ఉండిలో గురువారం నిర్వహించిన మినీ మహానాడు కార్యక్రమానికి ఏలూరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివెళ్ళారు. స్థానిక పవర్‌పేటలోని ఎమ్మెల్యే, మేయర్‌ క్యాంప్‌ కార్యాల‌యాల‌ వద్ద పార్టీ శ్రేణులు ర్యాలీగా మినీ మహానాడుకు వెళ్ళారు. ఈ ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే బడేటి కోట రామారావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఏటా మహానాడు కార్యక్రమాన్ని ఆనవాయితీగా నిర్వహిస్తున్నారన్నారు. తొలుత‌ నియోజకవర్గ స్థాయిలో మినీ మహానాడును ఏర్పాటు చేసి, వాటిలో ప్రవేశపెట్టిన తీర్మానాల‌ను జిల్లా మినీ మహానాడులో చర్చించి వాటిని రాష్ట్ర స్థాయి మహానాడులో ప్రవేశపెడతామన్నారు. ఈ నెల‌ 20వ తేదీన ఏలూరు నియోజకవర్గ స్థాయి మినీ మహానాడు కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పండుగ వాతావరణంలో జరిగిందన్నారు. ఈ నెల‌ 27, 28, 29 తేదీల్లో విజయవాడలోని సిద్ధార్ధ కాలేజీ గ్రౌండ్స్‌లో మహానాడు కార్యక్రమంలో జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్ళాల‌న్నారు. అనంతరం మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ మాట్లాడుతూ పేద, బడుగు, బల‌హీన వర్గాల‌ కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. అప్పటి నుంచి కూడా అధికారంలో ఉన్నా లేకపోయిన ప్రతీ ఏటా మహానాడు కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో జరుపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాల‌ని సూచించారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్‌ సభ్యులు ఎస్‌ఎంఆర్‌ పెదబాబు, డిప్యూటీ మేయర్‌ నాయుడు పోతురాజు, మాజీ డిప్యూటీ మేయర్లు చోడే వెంకటరత్నం, గుడివాడ రామచంద్ర కిషోర్‌, టిడిపి నాయకులు కొల్లేపల్లి రాజు, మల్లెపు రాము పాల్గొన్నారు.