ads
Sree VijayaLakshmi Textiles
Leela Narayana Pest Control
For Suggestions
1
galigopuram

వెబ్ ఏలూరు.కామ్ డెస్క్ : దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గత రెండు నెలల కాలంలో దురదృష్టవశాత్తు మరణించిన 35 కుటుంబాల‌కు చంద్రన్న బీమా పథకం కింద కోటి రూపాయల‌ పరిహారం అందించి పేద కుటుంబాల‌కు చంద్రన్న ఒక ఆర్ధిక భరోసా కల్పించారని రాష్ట్ర ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ చెప్పారు. దుగ్గిరాల‌ గ్రామంలో గురువారం చంద్రన్న బీమా పరిహార చెక్కును ఆయన వారసుల‌కు అందజేసారు. ఈసందర్భంగా చింతమనేని మాట్లాడుతూ 15 రూపాయలు చెల్లించి ప్రతీ పేదకుటుంబానికీ చంద్రన్న బీమా ఒక ఆసరాగా మారిందని, దురదృష్టవశాతు ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి 5 ల‌క్షల‌ రూపాయలు పరిహారం ఇచ్చి ఆకుటుంబానికి భరోసా కల్పించడం జరుగుతుందని ఆయన చెప్పారు. 50 ఏళ్లు దాటిన వారు సహజంగా మరణిస్తే వారికి కూడా చంద్రన్న బీమా సౌకర్యం కల్పిస్తున్నామని, దేశచరిత్రలో పేద కుటుంబానికి ఇంత పెద్ద మొత్తంలో ఆర్ధిక సహాయాన్ని అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కుతుందని చింతమనేని చెప్పారు. పేదవర్గాల‌ ఇళ్లల్లో పెళ్లిళ్లు జరుగుతుంటే ఆకుటుంబాల‌కు చంద్రన్న పెళ్లికానుక క్రింద కూడా ఆర్ధికసహాయం అందిస్తూ సమాజంలో ప్రతీ పేదకుటుంబాన్ని ఆదుకోవడానికి చంద్రబాబు అనేక క్రొత్త పధకాల‌ను ప్రవేశపెడుతున్నారని పేదవర్గాలు ఈ పథకాల ల‌బ్దిపొంది భవిష్యత్తులో తెలుగుదేశం ప్రభుత్వానికి అండగా నిల‌బడాల‌ని ఆయన కోరారు. రాష్ట్రంలో ప్రతీ పేదకుటుంబానికీ సొంత ఇంటి కల‌ను సాకారం చేయడం జరుగుతుందని గ్రావిూణ ప్రాంతాల‌లో స్థ‌లం లేక ఇంటికోసం ధరఖాస్తు చేసిన పేదల‌కు స్ధలంతోపాటు ల‌క్షా 50 వేల‌ రూపాయలు గృహనిర్మాణానికి ప్రభుత్వం ఉచితంగా అందిస్తూ ఆదుకుంటున్నదని చింతమనేని చెప్పారు. ఈ కార్యక్రమంలో దెందులూరు మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ మాగంటి సురేంధ్రనాధ్‌ చౌదరి, జడ్‌పిటిసిలు, యంపిపిలు మోరు శ్రావణి, పప్పు సుశీల‌, సక్కుభాయి, మోరు హైమావతి పాల్గొన్నారు.